ఈమధ్యన సుడిగాలి సుధీర్ మెల్లగా ఈటీవీకి దూరమవుతున్నాడనే అనిపిస్తుంది. కారణం అతను హీరోగా బిజీ కావడమే. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ డాన్స్ షో, అలాగే ఈటివి మల్లెమాల ఫెస్టివ్ ఈవెంట్స్ అంటూ సుధీర్ సందడి మాములుగా ఉండేది కాదు. రష్మీ తో కలిసి రకరకాల యాంగిల్స్ తో నవ్వించే సుధీర్ అంటే కామెడీ ప్రియులకి, బుల్లితెర ప్రేక్షకులకి ప్రత్యేకమైన అభిమానం. అయితే ఈమధ్యన సుధీర్ ఢీ డాన్స్ షో లో కనిపించడం లేదు. ఆయన ప్లేస్ లోకి బిగ్ బాస్ అఖిల్, సీరియల్ ఆర్టిస్ట్ రవికృష్ణ వస్తున్నారు. కానీ సుధీర్ కామెడీ లేని ఢీ బోర్ కొట్టేస్తుంది అంటున్నారు ఢీ డాన్స్ అభిమానులు.
అలాగే ఈ సంక్రాంతి వేడుకల్లో కూడా సుధీర్ సందడి, హడావిడి ఈటీవీలో కనిపించలేదు. ప్రదీప్ యాంకర్ గా అమ్మమ్మగారి ఊరు ఈవెంట్ ఈటీవీలో సంక్రాంతి స్పెషల్ గా ప్రసారం అయ్యింది. అందులో ప్రదీప్ యాంకర్ గా రోజా, ఆమనీ జెడ్జెస్ గా కృతి శెట్టి, వైష్ణవ తేజ్ లు స్పెషల్ గెస్ట్ లుగా ఆది, రామ్ ప్రసాద్, ఇమ్మాన్యువల్, వర్ష, రవి కృష్ణ, లాస్య ఇలా అంతా పండగ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అలాగే రష్మీ గౌతమ్ కూడా సందడి చేసింది. కానీ సుధీర్ లేని లోటు మాత్రం బాగా కనబడింది. చాలామంది సుధీర్ లేని సంక్రాంతి సెలెబ్రేషన్స్ చప్పగా ఉన్నాయంటున్నారు.