దీప్తి సునయన అనే పేరు బిగ్ బాస్ సీజన్ 2 లో బాగా విపించింది. ఎందుకంటే ఆమె ఆ సీజన్ లో కంటెస్టెంట్ గా గ్లామర్ డాల్ గా కనిపించడమే కాదు, తనీష్ తో డీప్ ఫ్రెండ్ షిప్ చెయ్యడం, ఆ సీజన్ లో హగ్గులతో దీప్తి సునయన తనీష్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు అదే విషయాన్ని అందరూ దీప్తి సునాయానని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే దీప్తి సునయన తన బాయ్ ఫ్రెండ్ కం లవర్ షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది. అది కూడా షణ్ముఖ్ తన ఫ్రెండ్ సిరి కి హగ్గులు, ముద్దులు ఇచ్చిన కారణంగానే. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి - షణ్ముఖ్ ఎమోషనల్ గా కనక్ట్ అయ్యారు.
వీరిద్దరూ హగ్గులు, ముద్దులతో కాస్త లిమిట్స్ క్రాస్ చేసారు.అది నచ్చని దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేయడంతో. కాంట్రవర్సీ క్వీన్ శ్రీరెడ్డి, దీప్తి సునయానాకి ప్రశ్న వేసింది. మరి నువ్వు సీజన్ 2 లో తనీష్ తో చేసింది ఏమిటి.. అది తప్పు కాదా.. షణ్ముఖ్ ది తప్పైనప్పుడు నీది తప్పే అంది. అయితే తాజాగా దీప్తి సునయన శ్రీరెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ తాను చాలా చిన్న వయసులోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాను అని, తనకి ఏమి తెలియని వయసులో తనీష్ తో ఫ్రెండ్ షిప్ ఎమోషనల్ బాండింగ్ పై ఎలాంటి క్లారిటీ లేదని, కానీ బిగ్ బాస్ నుండి తాను చాలా నేర్చుకున్నాను అని చెప్పింది. తనీష్ తో ట్రాక్ నడిపిన విషయాన్ని ఒప్పేసుకున్న దీప్తి.. అది తెలియకుండా జరిగింది అంటూ కవర్ చేసింది.