రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి ఆర్.ఆర్.ఆర్ ఈ సంక్రాంతి ఫెస్టివల్ ని ఊపేస్తారనుకుంటే.. కరోనా ఆర్.ఆర్.ఆర్ రాకుండా అడ్డుపడింది. చరణ్, ఎన్టీఆర్ కలిసి సినిమాలో కనిపించడం మొదటిసారి కావడంతో.. ఆ సినిమాపై భీభత్సమైన అంచనాలు, ఆసక్తి ఉన్నాయి. మరి కలిసి వస్తేనే ఇంత క్రేజీగా ఉంటే.. ఇద్దరూ వేరు వేరుగా తలపెడితే.. ఆ ఫీలింగ్ ఫాన్స్ కి చెప్పలేనంత ఉంటుంది. ఎన్టీఆర్ vs రామ్ చరణ్ అంటే ఆ ఇద్దరి ఫాన్స్ తమ హీరోలపై అంచనాలు పెట్టేసుకుంటారు. అందులోనూ ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా మూవీ తర్వాత తలపెడితే అది వేరే లెవల్ అన్నట్టుగా ఉంటుంది.
రామ్ చరణ్ vs ఎన్టీఆర్ అంటే.. ఎన్టీఆర్, ఎన్టీఆర్ - కొరటాల కాంబో మూవీ NTR30 ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరోపక్క రామ్ చరణ్ - శంకర్ కాంబోలో క్రేజీ గా తెరకెక్కుతున్న RC15 కూడా మూడు భాషల్లో వచ్చే ఏడాది అంటే 2023 సంక్రాంతికే రిలీజ్ అంటున్నారు. సో ఆర్.ఆర్.ఆర్ లో కలిసి కనిపించి, తర్వాత తమ సినిమాలతో ఒకేసారి పోటీకి దిగుతున్న ఎన్టీఆర్ అండ్ రామ్, చరణ్ సినిమాలపై ఫాన్స్ లో అప్పుడే ఆత్రుత, అంచనాలు మొదలైపోయాయి. మరి అన్ని సెట్ అయితే రామ్ చరణ్ RC15, NTR30 తో ఎన్టీఆర్ వచ్చే సంక్రాంతి కి బాక్సాఫీసుని షేక్ చెయ్యడం ఖాయమే.