Advertisementt

పవన్ కి విలన్ గా కోలీవుడ్ టాప్ హీరో

Tue 18th Jan 2022 01:29 PM
pawan kalyan,vijay sethupathi,bheemla nayak,hari hara veera mallu,bhavadeeyudu bhagat singh  పవన్ కి విలన్ గా కోలీవుడ్ టాప్ హీరో
Pawan to fight him in Bhavadeeyudu Bhagat Singh? పవన్ కి విలన్ గా కోలీవుడ్ టాప్ హీరో
Advertisement
Ads by CJ

సంక్రాంతి ఫెస్టివల్ కి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వచ్చి ఉంటే.. బాక్సాఫీసు దగ్గర జాతర మాములుగా ఉండేది కాదు.. కానీ ఆర్.ఆర్.ఆర్ కోసం భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ అయితే.. ఇప్పుడు కరోనా కారణంగా ఫిబ్రవరి 25 నుండి కూడా మరోసారి పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది పరిస్థితి. ఇక భీమ్లా నాయక్ తర్వాత పవన్ కళ్యాణ్ ఒకే టైం లో హరి హర వీరమల్లు, హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ మూవీస్ ని చెయ్యనున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్ కాగా.. భవదీయుడు భగత్ సింగ్ రెగ్యులర్ షూట్ హరీష్ దర్శకత్వంలో త్వరలోనే మొదలు కానుంది.

యాక్షన్ ఎంటర్టైనర్ గా భవదీయుడు భగత్ సింగ్ ని దర్శకుడు హారిష్ శంకర్ తెరకెక్కించబోతున్నారని, పవన్ కళ్యాణ్ డ్యూయెల్ రోల్ పోషించబోతున్నారని, పవన్ భగత్ సింగ్ రోల్ పవర్ గా ఉండబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు భవదీయుడు భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కి పవర్ ఫుల్ విలన్ గా కోలీవుడ్ టాప్ హీరో విజయ్ సేతుపతి నటించబోతున్నాడని, విలన్ గా విజయ్ సేతుపతి పవన్ కి పర్ఫెక్ట్ అని, హరీష్ శంకర్ విజయ్ సేతుపతితో చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రాబోతుంది అని తెలుస్తుంది. 

Pawan to fight him in Bhavadeeyudu Bhagat Singh?:

Pawan Kalyan and Vijay Sethupathi locking horns on big screen

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ