Advertisementt

సుధీర్ - రష్మీలని మరిపిస్తున్నారట

Wed 19th Jan 2022 09:14 AM
ravi krishna,navya swamy,dance performance,dhee 14 stage,sudheer,rashmi,hyper aadi  సుధీర్ - రష్మీలని మరిపిస్తున్నారట
Ravi Krishna - Navya Swamy dance performance on Dhee stage సుధీర్ - రష్మీలని మరిపిస్తున్నారట
Advertisement
Ads by CJ

ఢీ డాన్స్ షో లో సుధీర్ - రష్మిల జంట మాయమైంది. ఢీ డాన్స్ సీజన్ 14 లో సుధీర్ లేకుండానే మూడు వారాలు గడిచిపోయి నాలుగో వారం వచ్చేసింది. సుధీర్ కామెడీ లేదు, రష్మీ అందాలు కనిపించడం లేదు. డాన్స్, కామెడీ ప్రియులు సుధీర్ ని, ఆయనపై వేసే పంచెస్ ని బాగా మిస్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఢీ డాన్స్ 14 లో హైపర్ ఆది, ప్రదీప్ తో పాటుగా అఖిల్, రవి కృష్ణ - నవ్య స్వామిల సందడి కనిపిస్తుంది. రవి కృష్ణ - నవ్య స్వామిలు సీరియల్స్ లో కలిసి నటించారు. వారి మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ చాలా ప్రచారమే జరిగింది. అయితే ఇప్పుడు ఈ జంట.. ఢీ డాన్స్ జోడి కి మెంటర్స్ గా వచ్చారు.

అంతేకాదు.. ఈ వారం రవికృష్ణ - నవ్య స్వామిలు ఢీ డాన్స్ షో స్టేజ్ పై కపుల్ గా మెంటర్స్ గా డాన్స్ పెరఫార్మెన్స్ ఇవ్వగానే. హైపర్ ఆది ఆహా.. ఆయన్ని ఈయన, ఆవిడని ఈవిడ మరిపిస్తున్నారుగా అంటూ సుధీర్ - రష్మిల జంటని రవికృష్ణ - నవ్య స్వామిలు జంట మరిపిస్తున్నది అంటూ హైపర్ ఆది కామెంట్స్ చేసాడు. కానీ సుధీర్ - రష్మీ కెమిస్ట్రీ ఎవరికీ రాదు. వారిమధ్యన తొమ్మిదేళ్ల కెమిస్ట్రీ ఉంది.. నవ్య స్వామి - రవికృష్ణ జంటగా ఎంతగా రొమాంటిక్ గా రెచ్చిపోయినా.. వారు రష్మీ - సుధీర్ ని మరిపించడం కష్టం అంటున్నారు సుధీర్ ఫాన్స్. 

Ravi Krishna - Navya Swamy dance performance on Dhee stage:

Dhee 14 latest episode highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ