అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మూవీ పుష్ప ద రైజ్ డిసెంబర్ 17 న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. హిందీ నుండి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పుష్ప సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చాయి. అల్లు అర్జున్ పుష్ప రాజ్ పెరఫార్మెన్స్, ఆయన మాట్లాడిన రాయలసీమ యాసకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అయితే ఈ సినిమాలో శ్రీవల్లి గా డీ గ్లామర్ గా అందాలు ఆరబోసిన రష్మిక మందన్న కి అంతగా పేరు రాకపోయినా.. ఆమె కేరెక్టర్ సినిమాలో నిడివి బాగా ఉంది. అందుకే ఫస్ట్ పార్ట్ కి రష్మిక 2 కోట్లు పారితోషకం అందుకుంది. ఆ సినిమా హిట్ అవడంతో.. పార్ట్ 2 కి ఏకంగా 50 శాతం పారితోషకం పెంచేసిందట.
పుష్ప ద రూల్ కి రష్మిక మూడు కోట్ల పారితోషకంఅందుకోబోతుందట. పుష్ప ద రూల్ లోనూ రష్మిక కేరెక్టర్ కి ప్రాధాన్యత ఉండడంతో.. మేకర్స్ కూడా రష్మిక అడిగింది కాదనడం లేదని టాక్. అయితే పుష్ప పాన్ ఇండియా మూవీలో రష్మిక శ్రీవల్లి కేరెక్టర్ కి ఓ అనుకున్నంత పేరైతే రాలేదనే చెప్పాలి. కొన్ని క్లోజప్ షాట్స్ లో రష్మిక డీ గ్లామర్ లుక్ చూడలేకపోయామని ప్రేక్షకులే పెదవి విరిచారు. అయినా పాప డిమాండ్, పార్ట్ వన్ హిట్ అవడంతో.. రష్మిక కి సెకండ్ పార్ట్ కోసం పారితోషకం పెరిగింది అంటున్నారు.