Advertisementt

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారా

Thu 20th Jan 2022 02:59 PM
dhanush,aishwarya,dhanush and aishwarya separation,rajinikanth,dhanush family  చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారా
Dhanush-Aishwaryaa To Patch Up? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారా
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య తన భర్త ధనుష్ తో విడిపోయింది. అటు ధనుష్ ఇటు ఐశ్వర్య ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా తాము విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించేసారు. కూతురు విడాకుల విషయం రజినీకాంత్ కి తెలియకుండా ఉంటుందా? ధనుష్ తన భార్య తో విడిపోతున్నాడనే విషయం ఆయన ఫ్యామిలీకి తెలియకుండా ఉంటుందా? వాళ్ళకి తెలిసినా ఏమి చెయ్యలేక పోవడం వలనే వారిద్దరూ తమ విడాకుల ప్రకటన వచ్చేసింది. మరి అధికారికంగా విడాకుల ప్రకటన వచ్చాక ఇప్పుడు రజినీకాంత్ కానీ, ధనుష్ ఫ్యామిలీ కానీ ఏం చేయగలుగుతుంది.

కానీ ఇప్పుడు రజినీకాంత్, అటు ధనుష్ ఫ్యామిలీ కలిసి ధనుష్ - ఐశ్వర్య మధ్యలో ప్యాచప్ చెయ్యడానికి రెడీ అయ్యారని, ఇద్దరికి సర్ది చెప్పేందుకు రెండు ఫ్యామిలీలు పూనుకుంటున్నాయని, వారిమధ్యన జరిగిన గొడవలను పరిష్కరించేందుకు రజినీకాంత్ ధనుష్ తోనూ, ధనుష్ ఫ్యామిలీ ఐశ్వర్య తోనూ మాట్లాడేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. మరి అఫీషియల్ గా విడాకుల ప్రకటన వచ్చాక రజినికాంత్ కానీ, ధనుష్ ఫ్యామిలీ కానీ ఏం చేస్తుంది. ఏం చేయగలుగుతుంది. అది చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే అవుతుంది.

Dhanush-Aishwaryaa To Patch Up?:

Dhanush And Aishwarya Separation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ