Advertisementt

దాసరి పరువు తీస్తున్న కొడుకులు

Thu 20th Jan 2022 07:06 PM
dasari arun kumar,dasari son,dasari narayana rao,drunk and drive case,registered  దాసరి పరువు తీస్తున్న కొడుకులు
Dasari Arun Kumar Rash Driving Case దాసరి పరువు తీస్తున్న కొడుకులు
Advertisement
Ads by CJ

దాసరి నారాయణరావు.. సినిమా ఇండస్ట్రీ కి పెద్దగా, దర్శకనిర్మాతగా, యాక్టర్ గా ఆయనకున్న పేరు మామూలుది కాదు. దాసరి అంటే ఇష్టపడని వారుండరు. దాసరి సినిమా ఇండస్ట్రీకి పెద్దే. కానీ తన కుటుంబాన్ని చక్కబెట్టేకోలేకపోయారాయన. దాసరి ఉన్నప్పుడే ఆయన ఇంట్లో ఆస్తి గొడవలతో కొడుకులిద్దరూ రోడ్డెక్కారు. దాసరి ప్రభు, దాసరి అరుణ్ లు దాసరి ఆస్తుల కోసం కొట్టుకున్నారు. దాసరి మరణం తర్వాత ఆ గొడవలు మరింతగా ముదిరిపోయాయి. మోహన్ బాబు, దాసరి గారికి శిష్యుడిగా దాసరి ఇంట్లో జరిగిన గొడవలను తీర్చుతారనుకుంటే.. మోహన్ బాబు వల్ల కూడా కాలేదు. 

ఇక తర్వాత అరుణ్, ప్రభు లు ఎవరి లైఫ్ ల్లో వాళ్ళు బిజీ అయినా, వారి మధ్యన తగాదాలు మాత్రం వదల్లేదు. తాజాగా దాసరి గారి పరువుని ఆయన కొడుకు అరుణ్ కుమార్ తీసేసారు. దాసరి అరుణ్ కుమార్ ఫుల్ గా మద్యం తాగి తన కారుతో రోడ్డు పక్కన ఉన్న ద్విచక్ర వాహనాలను ఢీకొట్టారు. ఈ ఘటనలో పలు వాహనాలు పాడయ్యాయి. దానితో ఒక ద్విచక్ర వాహనం యజమాని సయ్యద్ అఫ్జల్ దాసరి అరుణ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీస్ లు అరుణ్ పై కేసు నమోదు చేశారు. సెక్షన్ 279, 336, డ్రంకెన్ డ్రైవ్ కింద కేసు బుక్ చేశారు. ఈ కేసులో దాసరి అరుణ్ కుమార్ ఈరోజు గురువారం బంజారాహిల్స్ పోలీసుల ముందు హాజరయ్యారు.

Dasari Arun Kumar Rash Driving Case:

Drunk And Drive Case Registered On Dasari Son

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ