అగ్ర నిర్మాత దిల్ రాజు ఫోకస్ అంతా ఇప్పుడు తన అన్న కుమారుడు ఆశిష్ పైనే వుంది. అతని కోసం దిల్ రాజు ఇప్పుడు ఏదైనా చెయ్యడానికి రెడీ గా ఉన్నట్టున్నారు. మొదటి సినిమా రౌడీ బాయ్స్ డిసాస్టర్ అయింది, కానీ దిల్ రాజు లాంటి నిర్మాంత ఆ సినిమా ఇన్ని కోట్లు కలెక్టు చేసింది, అన్ని కోట్లు కలెక్టు చేసింది అని చెప్పడం విడ్డూరం. మొదటి సినిమా ప్లాప్ అయితే అది ఒప్పుకొని, రెండో సినిమాకి ఇంప్రూవ్ చేసుకొనేటట్టు తాయారు చెయ్యాలి. దిల్ రాజు లాంటి నిర్మాత కూడా ప్లాప్ సినిమా సుమారు ఏడు కోట్లు కలెక్టు చేసిందని చెప్పటం చూసి అందరూ నవ్వుకుంటున్నారు.
ఆశిష్ నటించిన రౌడీ బాయ్స్ సినిమాని ప్రేక్షకులు ఆమోదించలేదు అన్న విషయం రూఢిగా అర్థం అయింది. అయినా రెండు, మూడు సినిమాలు కూడా దిల్ రాజు ఆశిష్ కి ఫిక్స్ చేసేసాడు. దిల్ రాజు ఒకటి గ్రహించాలి, తన దగ్గర డబ్బులు వున్నాయి కాబట్టి ఎన్ని సినిమాలు అయినా తీస్తాడు. కానీ ప్రేక్షకుల ఆమోదం లేకపోతే ఎన్ని సినిమాలు తీసి, ఎంత కలెక్టు చేసిందని అబద్దాలు చెప్పినా డబ్బు వేస్ట్ తప్ప పేరు రాదు. గతంలో చూసుకుంటే, పూరి జగన్ తన తమ్ముడు సాయి రామ్ శంకర్ కోసం ఎంత తపన పడ్డాడో తెలుసు కదా... తమ్ముడికి హిట్ ఇచ్చేంత వరకు సినిమాలు తీస్తా అన్నాడు.
చివరికి ఏమైంది.. సాయి రామ్ శంకర్ మంచి యాక్టర్ కూడాను... కానీ సక్సెస్ రాలేదు. అది వాళ్ళ చేతుల్లో లేదు. ప్రేక్షకుల చేతుల్లో వుంది. ఇండస్ట్రీ వాళ్ళు అనేది ఏంటంటే, తప్పుడు కలెక్షన్స్ మీద కాకుండా, కుర్రాడి ని యాక్టింగ్ లో ఇంప్రూవ్ చేసుకోమనండి, కథల మీద ఫోకస్ పెడితే మంచిది... అప్పుడు సక్సెస్ దానంతట అదే వస్తుంది.