సినిమా ఇండస్ట్రీ నుండి వారసులు వస్తున్నారంటే ఆ హంగామా ఎలా ఉంటుందో చాలామంది వెండితెరకు పరిచయమైన వారసులని చూస్తే తెలిసింది. కానీ ఈ సంక్రాంతికి ఇద్దరు హీరోలు సినిమా ఇండస్ట్రీ ఫ్యామిలీకి చెందిన వారసులు.. సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అవ్వగా. అందులో దిల్ రాజు వారసుడు రౌడీ బాయ్స్ తో అట్టర్ ప్లాప్ కొట్టగా.. మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరో తో హిట్ కొట్టాడు. పాపం గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ప్రమోషన్స్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ జరిగింది. అంటే మహేష్ వచ్చి హీరోని ప్రమోట్ చేస్తాడనుకుంటే.. మహేష్ కి కరోనా రావడం, కృష్ణ గారైన వస్తారనుకంటే. రమేష్ బాబు పోవడం.. ఇలా అశోక్ కి టైం కలిసి రాకపోయినా.. హీరో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ మూవీ తో నే సక్సెస్ అందుకున్నాడు. సినిమా హిట్ అయినా కలెక్షన్స్ రాలేదు. దానికి సవాలక్ష కారణాలు. ఒకటి కొత్త హీరో, మహేష్ మేనల్లుడైతే ఏంటి అన్నట్టుగా ప్రేక్షకులు ఉన్నారు. మరోపక్క ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా నాగార్జున బంగార్రాజు మూవీ ఉండడం ఇలా హీరో సినిమాకి కి మైనస్ లు అయ్యాయి. మరోపక్క ప్రమోషన్స్ హడావిడిగా చెయ్యడం కూడా సినిమాకి డెబ్బయ్యింది. కొత్త హీరో అన్నప్పుడు మహేష్ బాబు, కృష్ణ లు కంపల్సరీ.. ప్రమోషన్స్ లో ఉంటే అశోక్ కి కలిసి వచ్చేది. ఏదైనా గల్లా జయదేవ్ కి డబ్బు కి లోటేముంది.. కొడుకు హిట్ కొట్టాడు చాలు.