మెగా స్టార్ చిరంజీవి బాలకృష్ణ చేస్తున్న టాక్ షో లో ఎందుకు కనిపించలేదని చాలామందికి సందేహం వస్తోంది. వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం వుంది, మరి ఎందుకు బాలకృష్ణ చిరంజీవి ని ఆ షో కి పిలవలేదు అన్నది ప్రశ్న. అయితే బాలకృష్ణ టాక్ షో మహేష్ బాబు తో ఈ సీజన్ అయిపోతోంది. మళ్ళీ ఆహా వాళ్ళు సెకండ్ సీజన్ స్టార్ట్ చేస్తారు అని తెలిసింది.
మొదటి సీజన్ లోనే అందరి టాప్ యాక్టర్స్ ని పిలిస్తే మరి సెకండ్ సీజన్ బోర్ అయిపోతుందని, చిరంజీవి ని సెకండ్ సీజన్ కి పెట్టారు అని తెలిసింది. చిరంజీవి తో పాటు, మరి కొంత మంది నటులు ప్రభాస్, నాగార్జున లాంటి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. బాలయ్య షో సూపర్ సక్సెస్ అయినా సందర్భంలో ఆహా వాళ్ళు ఆ షో ని ఎలా అయినా కంటిన్యూ చెయ్యాలని చూస్తున్నారు. సెకండ్ సీజన్ కూడా త్వరగానే మొదలు పెడతారని సమాచారం. ఇంకా కొంచెం వైవిధ్యం గా ఉండేట్టు ఆహా వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు కూడా సమాచారం.