Advertisementt

సందీప్ కిషన్ కూడా పాన్ ఇండియా యాక్టర్?

Sat 22nd Jan 2022 09:34 AM
sundeep kishan,pan india actor,sundeep kishan hero,tolly wood,bolly wood,sandeep kishan  సందీప్ కిషన్ కూడా పాన్ ఇండియా యాక్టర్?
Sundeep Kishan is also a Pan India Actor? సందీప్ కిషన్ కూడా పాన్ ఇండియా యాక్టర్?
Advertisement
Ads by CJ

ఇప్పుడు ప్రతి యాక్టర్ పాన్ ఇండియన్ సినిమా చేసేవాళ్ళే. పాన్ ఇండియా అంటే అంత చీప్ అయిపొయింది మరి. సందీప్ కిషన్ కూడా పాన్ ఇండియన్ సినిమా చేసేస్తున్నది. ఇది విషయం. ఆమధ్య సందీప్ సినిమాలు చాలానే విడుదల అయినట్టున్నాయి, కానీ అందులో ఒక్క సినిమా అయినా ఎవరయినా గుర్తు పెట్టుకున్నారా. అప్పుడెప్పుడో రిలీజ్ అయినా వేంకటాద్రి ఎక్సప్రెస్ మరి కొన్ని తప్ప సందీప్ కి సినిమాలు అనుకున్నంత రేంజ్ లో లేవు ఆడలేదు. సందీప్ తెలుగులోనే ఇంకా ఎవరికీ సరిగ్గా తెలీదు, కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేసేస్తాడట.

ఇద్దరు తమిళ్ యాక్టర్స్ ఉంటే చాలు, పాన్ ఇండియా సినిమా అయిపోతుందా. అప్పుడెప్పుడో ఒక హిందీ సినిమా చేసినట్టు గుర్తు. అలాగే ఏవో తమిళ్ సినిమాలు కూడా చేసాడు. కానీ ఒక్కటేనా అనుకున్నంత రేంజ్ లో లేవు. అంతగా పేరు కొద రాలేదు. సందీప్ అంటే ఎవరికయినా తెలుసా అసలు? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్ఠీఆర్ లాంటి నటులను చూసి తాను కూడా పాన్ ఇండియా సినిమా చేసేస్తా అంటే ఎలా? మొన్న రిలీజ్ అయినా గల్లీ రౌడీ ఏమైంది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మరి తెలుగు లో ఈమధ్య కాలం లో ఒక్క సక్సెస్ కూడా లేని అతను పాన్ ఇండియా చేసేస్తాడా? ఉట్టికి ఎగరలేనిది స్వర్గానికి ఎగురుతుందా అన్నట్టయింది.? 

Sundeep Kishan is also a Pan India Actor?:

Sundeep Kishan also acting Tamil films

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ