Advertisementt

ఈసారైనా.. హిట్ వచ్చేనా

Sat 22nd Jan 2022 08:55 PM
naga shaurya,anish r krishna,ira creations krishna,vrinda vihari first look out,naga shaurya birthday special  ఈసారైనా.. హిట్ వచ్చేనా
Naga Shaurya Birthday Special ఈసారైనా.. హిట్ వచ్చేనా
Advertisement
Ads by CJ

బర్త్ డే బాయ్ నాగ శౌర్య వరస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. ఛలో తప్ప చెప్పుకోదగ్గ హిట్ లేని ఈ యంగ్ హీరోకి అదృష్టం కలిసి వచ్చినా.. దురదృష్టం వెంటాడినట్టుగా.. లేడీ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో నటించిన వరుడు కావలెను సినిమా హిట్ అయినా.. కలెక్షన్స్ మాత్రం రాలేదు.. ఆ సినిమా ఛలో మాదిరిగా డీసెంట్ టాక్ తెచ్చుకుంది.. కానీ నాగ శౌర్య లక్కు బాగోలేదు. అది కూడా ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. ఇక లక్ష్య అయితే మాములు డిజాస్టర్ కాదు. సిక్స్ ప్యాక్ అంటూ లక్ష్యలో నాగ శౌర్య మేకోవర్ బావున్నా సినిమా ఫలితం దానిని హైలెట్ అవ్వనీయలేదు.

ఎన్ని ప్లాప్ లు ఎదురైనా వరస సినిమాలతో క్షణం తీరికలేకుండా గడుపుతున్న నాగ శౌర్యకి ఇప్పుడు ఓన్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి. నాగ శౌర్య ఓన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న కృష్ణ వ్రింద విహారి అంటూ నాగ శౌర్య చాలా డీసెంట్ గా కనిపిస్తున్నాడు. మరి ఓన్ బ్యానర్ అయినా కృష్ణ వ్రింద విహారి తో నాగ శౌర్య కెరీర్ ని ఆదుకుంటుందేమో చూడాలి.. బర్త్ డే బాయ్ నాగ శౌర్య కి ఈసారైనా సక్సెస్ రావాలని కోరుకుంటూ సినీజోష్ టీం తరపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే. 

Naga Shaurya Birthday Special :

Naga Shaurya Krishna Vrinda Vihari First Look Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ