దర్శకుడు మారుతి ప్రభాస్ సినిమాకి దర్శకత్వం చేస్తున్నాడు అని నిన్న కొందరు బ్రేకింగ్ న్యూస్ గా ఇచ్చారు. ప్రభాస్ ఇప్పటికే చాలా సినిమాలతో బిజీ గా వున్నాడు. అదీ కాకుండా, ఆ సినిమాలు అన్ని పూర్తి అయ్యేసరికి మూడు నాలుగు సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఈ పాండమిక్ సమయం లో ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టొచ్చు. ఈలోపు ఇదిగో ఈ న్యూస్ వచ్చింది. సినిమానే కాదు, సినిమా టైటిల్ ని మరియు దానికి ఎవరెవరు పనిచేస్తారో కూడా రాసేశారు. అయితే ఇదంతా మారుతి తనకి అత్యంత సన్నిహితుడు అయిన తన జర్నలిస్ట్ మిత్రుడితో ఈ న్యూస్ వేయించి, తరువాత తానే తన సోషల్ మీడియా లో ఆ న్యూస్ మీద ఒక వివరణ కూడా ఇచ్చేసాడు.
ఇదంతా చూస్తుంటే మారుతి పబ్లిసిటీ స్టంట్ గా కనపడటం లేదూ? ఈరోజుల్లో అధికారికంగా ప్రకటించిన సినిమా కాంబినేషన్ లే పట్టాలెక్కడం లేదు, అదీ కాకుండా, ఈరోజు ఫలానా స్టార్ తో పలానా దర్శకుడు చేస్తున్నాడు అని న్యూస్ వస్తే, తెల్లవారేసరికి, ఆ దర్శకుడు వేరే స్టార్ దగ్గరికి వెళ్ళటం మనం చూడటం లేదా. ఎందుకు ఇది ప్రస్తావించటం అంటే, ప్రభాస్ కి ఇప్పటికే చాలా సినిమాలు లైన్ లో వున్నాయి, అదీ కాకుండా అతని రాధే శ్యామ్ ఇంకా విడుదలకి నోచుకోలేదు. ఈలోపు మారుతి కూడా ప్రభాస్ ని దర్శకత్వం చేస్తాడు అంటే, పబ్లిసిటీ స్టంట్ కాకపోతే, మరేంటి?
పాపం పబ్లిసిటీ కి ప్రభాస్ తేరగా దొరికాడు, ఎందుకంటే, ప్రభాస్ ఏమి మాట్లాడాడు, ఎవరిని నొప్పించాడు కదా. మారుతికి జర్నలిస్ట్ మిత్రుడు కూడా బాగా సాయం చేస్తున్నాడు. తీసుకున్నప్పుడు, ప్రతిఫలం ఇవ్వాలి కదా!