Advertisementt

గ్లామర్ మొత్తం స్టార్ మాలోనే

Sun 23rd Jan 2022 04:35 PM
comedy stars,dhee dance show,jabardasth show,deepika pilli,dhee dance show anchor  గ్లామర్ మొత్తం స్టార్ మాలోనే
Comedy Stars Dhamaka anchor Deepika Pilli breathtaking looks గ్లామర్ మొత్తం స్టార్ మాలోనే
Advertisement
Ads by CJ

ఒకప్పుడు ఈటివి కామెడీ షోస్, డాన్స్ షోస్ లో గ్లామర్ కే ఇంపార్టెన్స్ ఉండేది. అంటే జబర్దస్త్ కి అనసూయ ఎంట్రీ తో యాంకర్స్ కాస్తా గ్లామర్ యాంకర్స్ గా మారిపోయారు. అనసూయ గ్లామర్ కి కేరాఫ్ అడ్రెస్స్ గా మారాక రష్మీ, వర్షిణి, శ్రీముఖి లాంటి వాళ్ళు ఆ గ్లామర్ బాట పట్టి సక్సెస్ అయ్యారు. జబర్దస్త్ లో కామెడీ కన్నా అనసూయ, రష్మీ గ్లామర్ షో నే ఎక్కువగా హైలెట్ అవడంతో.. మల్లెమాల యాజమాన్యం ఢీ డాన్స్ షో కి కూడా ఈ గ్లామర్ రంగులు అద్దారు. రష్మీ గౌతమ్ గ్లామర్ షో తో ఢీ డాన్స్ షో కూడా కలర్ ఫుల్ గా మారింది. ప్రియమణి, పూర్ణ గ్లామర్ తో పాటుగా రష్మీ అందాలు, ఆమెకి తోడుగా యూట్యూబర్ దీపికా పిల్లి గ్లామర్ అదనపు ఆకర్షణగా ఢీ డాన్స్ షోకి నిలిచింది. 

కానీ ఇప్పుడు ఢీ షో లో ఈ గ్లామర్ మిస్ అయ్యింది. రష్మీ దగ్గర నుండి దీపికా పిల్లి వరకు, ప్రియమణి, పూర్ణ ఇలా అందరూ ఢీ డాన్స్ లో కనిపించడం లేదు.

వారంతా ఇప్పుడు స్టార్ మాకి జంప్ అయ్యారు. స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కి బ్యూటిఫుల్ గ్లామర్ యాంకర్ గా దీపికా పిల్లి వస్తుంటే.. వచ్చే వారం జేడ్జ్ ప్లేస్ లోకి పూర్ణ వస్తుంది. మరి అనసూయ, రష్మిలు కేవలం జబర్దస్త్ లోనే కనబడుతున్నారు. కానీ రష్మీ, దీపికా పిల్లిలు మాత్రం ఢీ డాన్స్ నుండి అవుట్ అయ్యి స్టార్ మా లో తేలారు. దీపికా పిల్లి గ్లామర్ షో ఇప్పుడు కామెడీ స్టార్స్ లో వెలిగిపోతుంది. అంటే ఈటీవీలో మిస్ అయిన గ్లామర్ స్టార్ లో తేలింది అన్నమాట. 

Comedy Stars Dhamaka anchor Deepika Pilli breathtaking looks:

Comedy Stars with Dhee dance show anchor

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ