Advertisementt

కీర్తి సురేష్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్

Mon 24th Jan 2022 11:10 AM
keerthy suresh,good luck sakhi,good luck sakhi theatrical trailer  కీర్తి సురేష్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్
Good Luck Sakhi Theatrical Trailer కీర్తి సురేష్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్
Advertisement
Ads by CJ

మహానటి తర్వాత ఎక్కువగా విమెన్ సెంట్రిక్ మూవీస్ తో ఆకట్టుకున్న కీర్తి సురేష్ తాజా చిత్రం గుడ్ లక్ సఖి రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ వారమే థియేటర్స్ లోకి రాబోతున్న గుడ్ లక్ సఖి నుండి ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. స్పోర్ట్స్ రొమ్‌-కామ్ గా రూపొందుతున్న ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. 

గుడ్ లక్ సఖి` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ లోకి వెళితే.. దేశంలో టాప్ షూటర్లను తయారు చేస్తానని జ‌గ‌పతిబాబు ప్రకటించడంతో ట్రైల‌ర్‌ ప్రారంభమవుతుంది. బ్యాడ్‌ల‌క్ స‌ఖి గా కీర్తి సురేష్ ప‌రిచ‌యం అవుతుంది.  కీర్తి పేరును జ‌గ‌ప‌తిబాబుకు సూచిస్తాడు ఆది పినిశెట్టి. ఇంత‌లో షూటింగ్ మహిళల కోసం కాదు అని గ్రామస్తులు దీనిని వ్యతిరేకిస్తారు. దాంతో  సఖి మళ్లీ దురదృష్టవంతురాలు అని నిరూపించుకుంటుంది. ఫ‌స్ట్ టైమ్ ఆమె టార్గెట్ రీచ్ అవ‌డంతో ఫెయిల్ అవుతుంది. అయితే జ‌గ‌ప‌తి బాబు ఆమెను ల‌క్ష్యాన్ని చేరుకునేవిధంగా ప్రేరేపిస్తారు.

గుడ్ లక్ సఖి ట్రైలర్ అంద‌రినీ ఆకట్టుకుంది. అన్ని కమర్షియల్ అంశాల‌ను చేర్చి ఒక ప‌ర్‌ఫెక్ట్ కమర్షియల్ మూవీగా ఈ సినిమాను మ‌లిచాడు ద‌ర్శ‌కుడు నగేష్ కుకునూర్. చిరంతన్ దాస్ విజువ‌ల్స్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ యొక్క నిర్మాణ విలువలు అగ్రస్థానంలో ఉన్నాయి. కీర్తి సురేష్ విలేజ్ బెల్లె అవతార్ లో సూపర్ కూల్ గా ఉంది. ఆమె ఈ పాత్రను చాలా ఈజ్‌తో చేసింది. ఆమె కోచ్ గా జ‌గ‌ప‌తిబాబు త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించాడు. ఆది పినిశెట్టి  మంచి పాత్ర‌లో క‌నిపించారు.

Good Luck Sakhi Theatrical Trailer :

Keerthy Suresh Good Luck Sakhi Theatrical Trailer Launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ