గత కొన్ని రోజులుగా గల గల గల గల లాలా భీమ్లా అంటూ హోరెత్తుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు. భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ పవర్ చూసేందుకు తహతహలాడుతున్నాయి అభిమానుల హృదయాలు. నిజానికి సంక్రాంతికే రావాల్సిన భీమ్లానాయక్ ఫిబ్రవరి 25కి పోస్టుపోన్ అవడంతో ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయినప్పటికీ సినిమాపై క్రేజ్ మాత్రం రోజు రోజుకీ పెరుగుతూనే వస్తోంది. పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానాల క్యారెక్టరైజెషన్సే మెయిన్ హైలైట్ గా, ఆత్మాభిమానానికీ - అహానికీ మధ్య జరిగే పోరే ప్రధాన అంశంగా వస్తోన్న భీమ్లా నాయక్ అవుట్ ఫుట్ అద్దిరిపోయే రేంజ్ లో వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఊర మాస్ అవతార్ లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పెరఫార్మెన్సు ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనేది ఎడిటింగ్ రూమ్ రిపోర్ట్. ఇలాంటి వార్తలన్నీ అభిమానుల్లోని అంచనాలను ఇంకా ఇంకా పెంచుతూ వెళుతుంటే.... ఆ అంచనాలకు ధీటుగా సినిమా ఫైనల్ కట్ సిద్ధం చేస్తోంది చిత్ర బృందం.
తాజా సమాచారం మేరకు భీమ్లా నాయక్ సినిమా లెంగ్త్ 130 నిముషాలు (రెండు గంటల పది నిముషాలు)గా లాక్ చేసారని తెలుస్తోంది. మొదట 2 గంటల 20 నిముషాల వరకూ ఉంచుదాం అనుకున్నప్పటికీ ఈ తరహా ఎమోషనల్ డ్రామా రేసీ స్క్రీన్ ప్లేతో సాగడమే కరెక్ట్ అనుకున్నారట. ఆ మేరకు ఫైనల్ కట్ రెడీ చేసాక చూసుకుంటే భీమ్లా మరింత భీభత్సంగా ఉన్నాడని, ప్రీ ఇంటర్వెల్ నుంచీ క్లైమాక్స్ వరకు ఊపిరి సలపనివ్వని ఉద్వేగభరిత కథనంతో థియేటర్స్ ని ఊపేస్తాడని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారట యూనిట్ మెంబర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక చకా చక్కర్లు కొడుతోంది. ఇదంతా వాస్తవమే అయితే మరిక ఫిబ్రవరి 25 నుంచీ పవర్ స్టార్ ఫాన్స్ కి ఎంతటి పూనకం వస్తుందో... బాక్స్ ఆఫీస్ ఎంతగా షేక్ అవుతుందో..!!