మెగా ఫ్యామిలీ నుండి ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్.. ఆ సినిమాలో పెరఫార్మెన్స్ పరంగా బాగా ఆకట్టుకున్నాడు. ఇక తదుపరి చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో కొండపొలం మూవీ చేసాడు వైష్ణవ్. అది ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక వైష్ణవ్ తేజ్ తన తర్వాత చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడితో మొదలు పెట్టాడు. గిరీశం అనే దర్శకుడితో వైష్ణవ్ తేజ్ తన మూడో చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జోడిగా కేతిక శర్మ నటిస్తుంది.
తాజాగా వైష్ణవ్ తేజ్ మూడో చిత్ర టైటిల్ ని ఓ టీజర్ తో రివీల్ చేసారు. రంగ రంగ వైభవంగా అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వైష్ణవ తేజ్ కి హీరోయిన్ కేతిక శర్మ ఇచ్చిన బట్టర్ ఫ్లై కిస్ హైలెట్ అయ్యింది. టైటిల్ టీజర్ లో వైష్ణవ్ తేజ్.. ఏంటే ట్రీట్ ఇస్తాను అని చేతులూపుకుంటూ వస్తున్నావ్ అని అడగగా.. కేతిక అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురావక్కర్లేదు తెలుసా అంటూ.. నీకు బట్టర్ ఫ్లై కిస్ తెలుసా అని అడుగుతుంది. ఏంటి బట్టర్ ఫ్లై కిస్సా అని అడిగిన వైష్ణవ్ కి కేతిక చాలా రొమాంటిక్ గా బటర్ ఫ్లై కిస్ ఇచ్చేసింది. దానిని చూసిన ఆడియన్స్ భలే పెట్టింది పాప బటర్ ఫ్లై కిస్ అంటూ కామెంట్ చేస్తున్నారు.