Advertisementt

రిలీజ్ డేట్ చెప్పకుండా ప్రమోషన్స్ ఎందుకు

Mon 24th Jan 2022 08:37 PM
dj tillu,siddhu jonnalagadda,dj tillu release date,pataas pilla song,dj tillu promotions  రిలీజ్ డేట్ చెప్పకుండా ప్రమోషన్స్ ఎందుకు
Why promotions without mentioning the release date రిలీజ్ డేట్ చెప్పకుండా ప్రమోషన్స్ ఎందుకు
Advertisement
Ads by CJ

సిద్ధు జొన్నలగెడ్డ నటించిన డి జె టిల్లు సంక్రాంతికి విడుదల అని ప్రకటించి.. తర్వాత విడుదల తేదీపై వెనక్కి తగ్గారు. కానీ మల్లి కొత్త తేదీ ప్రకటించలేదు, కానీ ప్రమోషన్స్ మాత్రం ఆగటం లేదు. ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కావాల్సి ఉండగా, నిర్మాత వంశి అనుభవ రాహిత్యం వల్ల, విడుదలకు నోచుకోలేదు. కానీ అప్పటి నుండి ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం చేస్తూనే వున్నారు. మరి ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించకుండా, ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. పోనీ ఇదేమయినా పెద్ద సినిమానా విడుదల రోజు బ్రహ్మాండం అయిన ఓపెనింగ్స్ వచ్చేస్తాయి అనుకుంటే, అదీ కాదు. 

నిర్మాత వంశీ కి ఏమి పాలుపోవటం లేదని సమాచారం. ఇప్పుడు ప్రేక్షకులు కూడా సినిమా హాల్స్ కి రావటం లేదు, ఈ టైం లో విడుదల చెయ్యాలా, లేక మార్చ్, ఏప్రిల్ వరకు ఆగాలా అన్న మీమాంసలో వంశీ కొట్టుమిట్టాడుతున్నాడని అంటున్నారు. సిద్ధు ఈ సినిమాలో నటించటమే కాకుండా, స్టోరీ మరియు అన్ని విభాగాల్లో వేలు పెట్టాడు. అందుకని అతను ఈ సినిమాని ఒక ప్రెస్టేజ్ లా తీసుకున్నాడు. కానీ విడుదల ఎప్పుడు అన్నది తెలియకుండా ఎంత ప్రమోషన్ చేసినా వేస్ట్ కదా! 

Why promotions without mentioning the release date:

DJ Tillu To Get A Change In Release Date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ