బిగ్ బాస్ లోకి వెళ్ళింది అలా ఫెమస్ అయ్యింది, యూట్యూబ్ లో డాన్స్ చేసింది, ఆల్బమ్స్ చేసింది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముఖ్ తో బ్రేకప్ చెప్పి విపరీతమైన క్రేజ్ కాదు, విపరీతంగా పాపులర్ అయ్యింది. షణ్ముఖ్ తో ఐదేళ్ల ప్రేమని వదిలేసుకుంది. షణ్ముఖ్ బిహేవియర్ నచ్చక అతనికి బ్రేకప్ చెప్పిన దీప్తి సునయన ఐదేళ్లు ప్రేమ కోసం కెరీర్ ని పక్కనబెట్టాను అని, ఇకపై కెరీర్ పై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇక మళ్ళీ యూట్యూబ్ లో దీప్తి సునయన బిజీ అవుతుంది అనుకున్నారు అంతా.
కానీ దీప్తి సునయన వెండితెర కి ఎంట్రీ ఇవ్వబోతుంది అని, అది కూడా హీరోయిన్ గా ఓ సినిమాకి ఓకె చెప్పేసింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయ్యింది. అంటే ఇక దీప్తి సునాయానని హీరోయిన్ గానే చూస్తామేమో అంటూ ఆమె ఫాన్స్ ఫిక్స్ అవుతుంటే.. దీప్తి సునయన మాత్రం తనకంత సీన్ లేదంటుంది. అంటే తాను టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది అని వస్తున్న వార్తలపై దీప్తి సునయన స్పందిస్తూ.. అవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే తాను ఎలాంటి సినిమా కి కమిట్ అవ్వలేదని, నేను హీరోయిన్ అవుతున్న విషయం నాకు తెలియదే అంటూ కౌంటర్ వేసింది కూడా.