షణ్ముఖ్ జస్వంత్.. అతను బిగ్ బాస్ లోకి వెళ్లకముందే సోషల్ మీడియాలో తనకంటూ ఫ్యాన్ బేస్, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యూట్యూబర్, షార్ట్ ఫిలిం హీరో. షణ్ముఖ్ చేసిన వెబ్ సీరీస్ తో అతనికి కోట్లలో అభిమానులు పుట్టుకొచ్చారు. బిగ్ బాస్ కి కూడా టైటిల్ ఫెవరెట్ గానే షణ్ముఖ్ హౌస్ లోకి కాలు పెట్టాడు. అతను ఆడకపోయినా, నామినేషన్స్ లో ఉన్నా ఎలిమినేట్ అవ్వకుండా అతని ఫాన్స్ అతన్ని కాపాడారు. కానీ షణ్ముఖ్ సిరితో చేసిన ఫ్రెండ్ షిప్ అతని ఇమేజ్ ని డ్యామేజ్ చేసినా.. బిగ్ బాస్ రన్నర్ గా నిలవడానికి అతని ఫాన్స్ కారణం. ఇక సోషల్ మీడియాలో #UnStoppableShannu హాష్ టాగ్ తో అతన్ని బిగ్ బాస్ రన్నర్ ని చేసారు అభిమానులు.
బిగ్ బాస్ ముచ్చట ముగిసాక షణ్ముఖ్ కి అతని గర్ల్ ఫ్రెండ్ బై బై చెప్పేసింది. తన గర్ల్ ఫ్రెండ్ తనని ఒదిలి పోయినా.. మళ్ళీ షణ్ముఖ్ పడి లేచిన కెరటంలా కెరీర్ లో ముందుకు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. షణ్ముఖ్ హీరోగా మరో వెబ్ సీరీస్ ని స్టార్ట్ చేసి అనౌన్స్ చేసాడు. ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే వెబ్ సీరీస్ తో రాబోతున్నట్టుగా ప్రకటించాడు. అప్పటినుండి షణ్ముఖ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ట్రెండ్ అవడమే కాదు.. #AGENTANANDSANTOSH, #Shannu హ్యాష్ టాగ్స్ తో వరల్డ్ వైడ్ రికార్డ్ సృష్టించాడు.
ఫాన్స్ అభిమానంతో ట్విట్టర్ లో ఈ రెండు హాష్ టాగ్స్ ని లెక్కలేనన్ని ట్వీట్స్ తో ట్రెండ్ చెయ్యడంతో.. వర్డ్ వైడ్ గా #AGENTANANDSANTOSH హ్యాష్ టాగ్ కి 6 వ స్థానం, #Shannu కి ఎనిమిదో స్థానం దక్కినట్టుగా స్క్రీన్ షాట్స్ తో షణ్ముఖ్ తన ఇన్స్టా పేజీ లో షేర్ చేసాడు. దానిని చూసిన ఆయన ఫాన్స్ షన్ను అన్నా నువ్వు కేకే అంటూ రెచ్చిపోయి పండగ చేసుకుంటున్నారు.