Advertisementt

నిజంగా రవితేజకి ఇది స్పెషల్ అనే చెప్పాలి

Wed 26th Jan 2022 10:55 AM
ravi teja,ravi teja birthday special,ravi teja birthday special updates,khiladi song,dhamaka moview,ravanasura movie,rama rao on duty movie,tiger nageswara rao movie  నిజంగా రవితేజకి ఇది స్పెషల్ అనే చెప్పాలి
Ravi Teja Birthday Special నిజంగా రవితేజకి ఇది స్పెషల్ అనే చెప్పాలి
Advertisement
Ads by CJ

ఈ రోజు బుధవారం రిపబ్లిక్ డే. మాస్ మహారాజ్ రవి తేజ బర్త్ డే కూడా. జనవరి 26 రవి తేజ బర్త్ డే. ప్రతి ఏడాది రవి తేజ పుట్టిన రోజు స్పెషల్ గా ఏదో ఒక సినిమా లేదా రెండు సినిమాల అప్ డేట్స్ ఇస్తూ ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసేవారు. కానీ రవితేజ కి ఈ బర్త్ డే మాత్రం వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. రవి తేజ ఈ బర్త్ డే కి మాత్రం ఏకంగా నాలుగు సినిమాల అప్ డేట్స్ వస్తున్నాయి. ఈ ఏడాది రెండు మూడు సినిమాల రిలీజ్ లతో ఫాన్స్ కి రవితేజ కిక్ ఇవ్వబోతున్నాడు. ఆయన నటించిన రెండు సినిమాలు ఒక నెల గ్యాప్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

అందులో ముందుగా రమేష్ వర్మతో చేస్తున్న ఖిలాడీ మూవీ ఫిబ్రవరి 11 న రిలీజ్ కాబోతుంది.. ఆ సినిమా నుండి ఈ రోజు రవితేజ బర్త్ డే స్పెషల్ గా సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఇక శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ రామ రావు ఆన్ డ్యూటీ మూవీని మార్చి 25 న రిలీజ్ అంటున్నారు. ఆ సినిమానుండి రవితేజకి స్పెషల్ పోస్టర్ తో విషెస్ చెప్పారు. ఇక తదుపరి సినిమాని సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర గా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. రావణాసుర గా రవితేజ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఇక రవి తేజ పుట్టిన రోజునాడు.. ఆ సినిమా నుండి స్పెషల్ అప్ డేట్ రాబోతుంది.

రవితేజ మరో సినిమా డమకా త్రినాధ్ రావు నక్కిన తెరకెక్కిస్తున్నారు. మరి ధమాకా నుండి కూడా ఈరోజు అప్ డేట్ రాబోతుంది. తదుపరి రవితేజ పాన్ ఇండియా ఫిలిం టైగర్ నాగేశ్వర రావు నుండి ఎలాంటి అప్ డేట్ రాబోతుందో మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు కానీ.. నాలుగు సినిమాల అప్ డేట్స్ తో రవి తేజ బర్త్ డే కి సోషల్ మీడియా బ్లాస్ట్ అవ్వబోతుంది. మరి నాలుగు ఐదు ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్న రవితేజ ఈ బర్త్ డే స్పెషల్ కాక ఇంకేమవుతుంది. ఇక నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మాస్ రాజా రవితేజకి సినీజోష్ టీం తరఫునుండి ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.

Ravi Teja Birthday Special:

Ravi Teja Birthday Special updates 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ