Advertisementt

మొత్తానికి ఏదో కొత్తగానే ట్రై చేస్తున్నాడు

Wed 26th Jan 2022 03:46 PM
navadeep new movie love mouli,navadeep makeover,navadeep controversy  మొత్తానికి ఏదో కొత్తగానే ట్రై చేస్తున్నాడు
Navadeep naya avatar మొత్తానికి ఏదో కొత్తగానే ట్రై చేస్తున్నాడు
Advertisement
Ads by CJ

హీరోగా సరైన సక్సెస్ లేక సతమతమై.. నెగెటివ్ రోల్ కైనా నే రెడీనే అంటూ తనకు వచ్చిన అవకాశాల్లో నచ్చినవి చేసుకుంటూ వెళుతున్నాడు నవదీప్. విజయాల కోసమైతే వెంపర్లాడాడు కానీ వివాదాలకైతే కొదవే ఉండదు ఇతగాడికి. ఫార్మ్ హౌస్ లో పార్టీలనో, డ్రగ్స్ కేసులో ఉన్నాడనో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ ఇతని ఇంటిని అంటిపెట్టుకుని ఉంటుంది. అయితే తెలివి - తెగువ రెండు ఉన్నవాడు కనుక తనకెదురయ్యే ప్రతి ప్రాబ్లెమ్ నీ జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ వస్తున్నాడు. సోషల్ మీడియాలో కూడా నవదీప్ పెట్టే పోస్టులు, ఇచ్చే ఆన్సర్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అవన్నీ ఇక పక్కన పెడితే...

నటుడిగా తానేంటో నిరూపించుకునే ఓ ప్రాజెక్ట్ ఎంచుకున్నాడు నవదీప్. విభిన్నమైన ఆహార్యంతో వైవిధ్యమైన కథాంశంతో లవ్ మౌళిగా రానున్నాడు. నేడు ( జనవరి 26 ) నవదీప్ పుట్టినరోజు సందర్భంగా సదరు సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని ట్విట్టర్ వేదికగా రివీల్ చేసారు దగ్గుబాటి రానా. చూడగానే అరె ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడే అనిపించేలా ఉన్న ఆ మోషన్ పోస్టర్ లో ఇంట్రడ్యూసింగ్ నవదీప్ 2 .0  అని వేయడం విశేషం. ఓ నటుడు తనని తానే మళ్ళీ పరిచయం చేసుకుంటున్నాడు. అదీ ఇంతకు ముందులా కాకుండా అంతకుమించి అని ప్రకటిస్తూ.! సరే.. తన కల నెరవేరాలని, తన కాన్ఫిడెన్స్ నిజం అవ్వాలని మనమూ ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ బర్త్ డే బోయ్..!

Navadeep naya avatar:

Navadeep New Film Love Mouli

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ