అల్లు అర్జున్ హిట్ మీద హిట్ సినిమాలు కొడుతున్నాడు, అలాగే అల్లు అరవింద్ గారు నిర్మాతగా, ఆహ ఛానల్ పనుల్లో బిజీగా వున్నారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, అల్లు బాబీ కూడా నిర్మాతగా గని అనే సినిమాతో బిజీ గా వున్నాడు. ఆ కుటుంబం లో ఒక్క అల్లు శిరీష్ మాత్రం ఏమి అప్డేట్ లేకుండా వున్నాడు. అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏంటి అంటే, అల్లు శిరీష్ ఒక కొత్త సినిమా ఒప్పుకున్నట్టు, అందులో విలక్షణ నటుడు శ్రీ విష్ణు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
ఏ కె ఎంటర్ టైన్ మెంట్ వాళ్ళు ఈ సినిమా నిర్మాణం చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే దీనికి దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. శిరీష్ మరియు శ్రీ విష్ణు ఇద్దరు ఇందులో లీడ్ యాక్టర్స్ గా చేస్తున్నారని మాత్రం తెలుస్టడి. శిరీష్ ప్రేమ కాదంట సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. అయితే ఈ ప్రేమ కాదంట గురించి కూడా గత సంవత్సరం మే మాసం లో ఒక అప్డేట్ వచ్చింది అంతే, ఆ తరువాత మళ్లీ ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇప్పుడు ఈ శ్రీ విష్ణు తో సినిమా కూడా ఒప్పుకున్నాడు శిరీష్.