తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ మన వెంకీ అట్లూరి దర్శకత్వం లో సర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రెండు వారాల పాటు షూటింగ్ కూడా చేసారు, మధ్యలో ధనుష్ కి కరోనా సోకటం తో ఆపారు. మళ్ళీ ఇప్పుడు షూటింగ్ మొదలవుతుంది. ఇది తెలుగు తమిళ్ లో తీస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా కథ నేపథ్యం మాత్రం మన తెలుగు రాష్ట్రం లో జరిగిన కథే. ఆంధ్ర లో ఎడ్యుకేషన్ సిస్టం ఎలా ప్రభుత్వ కాలేజీల నుండి ప్రైవేట్ కాలేజీలకు మారింది, దీని వెనక వున్న కథ ఏంటి అన్నదే సర్ సినిమా నేపధ్యం. అందుకే దీనికి సర్ అని కూడా టైటిల్ పెట్టడం జరిగింది.
వెంకీ అట్లూరి మంచి రచయిత అవటం వల్ల, అతనికి ఈ ఆలోచన రావటంతో దాని మీద బాగా స్టడీ చేసి ఈ కథ తయారు చేసారని తెలిసింది. ఈ సినిమా ఆలోచన విధానంగా ఉంటుంది అని, మన ఎడ్యుకేషన్ సిస్టం ఇప్పుడు ఎలా తయారైంది, అప్పుడు ఎలా వుంది అన్నది చూపిస్తున్నారు ఇందులో. 1990 దశకంలో జరిగే కథ ఇది. అప్పట్లో లెక్టరర్స్ కి మంచి డిమాండ్ ఉండేది. ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ప్రభుత్వ కాలేజీల్లో చెప్పే లెక్చర్స్ కి డబ్బులు ఆశ చూపి తమ ప్రైవేట్ కాలేజీలకు రప్పించుకునేవారు. ప్రభుత్వ కాలేజీలు పోయి ప్రైవేట్ వాళ్ళు ఎలా ఎడ్యుకేషన్ సిస్టం మీద పైచెయ్యి అయింది అన్న టాపిక్ నేపధ్యం లో అల్లిన ఓ మంచి కథ అని సమాచారం. దీని కోసం విశాఖపట్నం బేస్ చేసుకొని సినిమా ఉంటుంది అని భోగట్టా.