ప్రభాస్ బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ ఓ మూవీ చెయ్యబోతున్నాడంటూ.. సోషల్ ఇండియాలో ఓ వార్త హల్చల్ చేసింది. ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్, స్పిరిట్ మూవీ లు చేస్తున్న ప్రభాస్ తన తదుపరి మూవీ కరణ్ జోహార్ తో చేయబోతున్నాడని అన్నారు. బాహుబలి టైం లోనే ప్రభాస్ కి కరణ్ జోహార్ కి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పటి నుండి ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేస్తున్న కరణ్ ప్రభాస్ తో కొత్త మూవీ అనగానే నిజమానేసుకున్నారు. అయితే కరణ్ జోహార్ ప్రభాస్ తో చేయబోయేది ఫ్రెష్ మూవీ కాదట. అంటే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ఓ ప్రాజెక్ట్ తో కరణ్ జోహార్ చేతులు కలుపుతున్నాడట.
అది నాగ్ అశ్విన్ - అశ్విని దత్ కలయికలో ప్రభాస్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కే పాన్ వరల్డ్ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కె లో కరణ్ జోహార్ కూడా ఎంటర్ అవ్వబోతున్నాడట. అంటే వైజయంతి మూవీస్ తో పాటుగా కరణ్ జోహార్ కూడా ఈ మూవీ కోసం ఇన్వెస్ట్ చేయబోతున్నాడట. హిందీలో కరణ్ జోహార్ అంటే టాప్ ప్రొడ్యూసర్. అక్కడ మార్కెట్ లో పాన్ ఇండియా మూవీలకి క్రేజ్ రావాలంటే అలాంటి ప్రొడ్యూసర్ హ్యాండ్ ఉండాలి. గతంలోనూ రాజమౌళి బాహుబలి అప్పుడు కరణ్ తో చేతులు కలిపారు. తర్వాత పూరి జగన్నాధ్ కూడా లైగర్ కోసం కరణ్ చేయి పట్టుకున్నాడు. ఇక ఆర్.ఆర్.ఆర్ మూవీ విషయంలోనూ కరణ్ హ్యాండ్ ఉంది. అలా ప్రభాస్ ప్రాజెక్ట్ లో వన్అఫ్ ద పార్టనర్ అవ్వడానికి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయట. అశ్విని దత్, నాగ్ అశ్విన్ లకి హిందీ కొత్తే. కాబట్టి కరణ్ ని తమ మూవీలోకి జాయిన్ చేసుకోవడానికి రెడీ అయినట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.