చిరంజీవి చిన్న కూతురు తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ నుండి విడాకులు తీసుకోబోతుంది అనే న్యూస్ గత రెండు నెలలుగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఆల్మోస్ట్ విడాకులు అయ్యిపోయాయి అని కూడా అంటున్నారు. అందుకే మెగా ఫ్యామిలీ కళ్యాణ్ దేవ్ ని, అతని సినిమాలని దూరం పెట్టింది అనే విషయం సూపర్ మచ్చి ప్రమోషన్స్ అప్పుడు, కిన్నెరసారి ట్రైలర్ రిలీజ్ అప్పుడు అర్ధమైంది. మరోపక్క సోషల్ మీడియాలో భర్త పేరుని తీసేసి శ్రీజ కొణిదెలుగా మారిపోయింది శ్రీజ. ఇంత జరుగుతున్నా మెగా కాంపౌండ్ మౌనంగానే ఉంది. అటు కళ్యాణ్ దేవ్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు. సూపర్ మచ్చిని గాలికి వదిలేసినట్లుగా, కిన్నెరసానిని ప్రమోట్ చెయ్యకుండా వదిలేస్తరేమో అనే అనుమానం అందరిలోనూ ఉంది.
ఇలాంటి సమయంలో చిరు చిన్న కూతురు శ్రీజ అన్న రామ్ చరణ్ తో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో తేలింది. రామ్ చరణ్ తన పెంపుడు కుక్క రైమా తో పాటుగా శ్రీజ తో కలిసి ముంబై లో కనిపించాడు. ఇటు చూస్తే కళ్యాణ్ దేవ్ మాత్రం జిమ్ లో కుస్తీలు పడుతూ.. నువ్ అది చేయలేవ్.. ఇది చేయలేవ్ అని చాలామంది చెబుతారు.. అలాంటప్పుడు వారిని చూసి నవ్వుకుని ఇలా చెప్పండి.. నేను చేస్తాను, చేసి చూపిస్తాను చూడండి అని చెప్పండంటూ.. జిమ్ లో కండలు తిరిగిన దేహంతో ఓ పిక్ పోస్ట్ చేసాడు. కానీ శ్రీజ తో విడాకుల విషయంపై స్పందించలేదు. సో శ్రీజ అన్న తో ముంబైలో కనబడితే.. కళ్యాణ్ దేవ్ మాత్రం జిమ్ లో కనిపించాడు.