Advertisementt

ష్యూర్ షాట్ హిట్.. రిలీజింగ్ ఆన్ మార్చ్ 17

Mon 31st Jan 2022 11:23 AM
puneeth rajkumar last film james,james release date,kannada film james  ష్యూర్ షాట్ హిట్.. రిలీజింగ్ ఆన్ మార్చ్ 17
Sure Shot Hit.. Releasing on March 17th ష్యూర్ షాట్ హిట్.. రిలీజింగ్ ఆన్ మార్చ్ 17
Advertisement
Ads by CJ

కాన్సెప్ట్ ఏదైనా ఓకే. కంటెంట్ ఎలా ఉన్నా ఓకే. బట్ నో డౌట్.. ఇది ష్యూర్ షాట్ హిట్ అని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని సినిమాలకి మాత్రమే చెప్పగలం. ఆ కోవలోకి వచ్చే చిత్రమే జేమ్స్. మరి ఈ చిత్రం ప్రత్యేకత ఏంటీ అంటారా... పునీత్ రాజ్ కుమార్. కన్నడనాట అశేష అభిమానుల్ని కలిగిన పునీత్ అకాల మరణం అక్కడే కాదు అంతటా అందరిలోనూ దిగ్భ్రాంతిని కలిగించింది. నటుడిగానే కాకుండా పలు సేవా కార్యక్రమాలతో వ్యక్తిగానూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్న పునీత్ ఆకస్మిక మృతి అందరి కళ్ళూ చెమ్మగిల్లేలా చేసింది. అయితే తను భౌతికంగా దూరమైనప్పటికీ తన చివరి చిత్రాన్ని మాత్రం మనకు వదిలి వెళ్లారు పునీత్. అదే జేమ్స్

ఈ చిత్రాన్ని మార్చ్ 17 న గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నారు. పునీత్ రాజ్ కుమార్ ఆఖరి చిత్రం ఇదే కావడం... తనని వెండితెరపై చూసే చివరి అవకాశం ఇదే అవ్వడంతో అభిమానులతో పాటు యావత్ ప్రేక్షకలోకం జేమ్స్ రాకకై ఎదురుచూస్తోంది. అందుకు అనుగుణంగానే ఆ వీక్ మరే కన్నడ చిత్రం కానీ, ఇతర భాషా చిత్రాలు కానీ కర్ణాటకలో విడుదల చెయ్యొద్దని నిర్ణయం తీసుకున్నారు. సో ఫెయిర్ పర్సన్ కి ఫేర్ వెల్ గ్రాండ్ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అనూహ్యంగా వదిలి వెళ్లిపోయిన ఆ మంచి వ్యక్తికి అందరూ ఘన విజయం సాక్షిగా వీడ్కోలు పలుకుతారు అనడంలో అనుమానమే అక్కర్లేదు. 

Sure Shot Hit.. Releasing on March 17th:

James Arriving on March 17th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ