పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ రాధేశ్యామ్ రిలీజ్ కి రంగం సిద్ధం అవుతోంది. పాండమిక్ సిట్యుయేషన్ వల్ల పలుమార్లు విడుదల వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని ఫైనల్ గా మార్చ్ 11 న ప్రేక్షకుల ముందుకు పంపేందుకై సన్నాహాలు షురూ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ టీజర్ తో, ఇంప్రెసివ్ సాంగ్స్ తో అల్ ఓవర్ ఇండియా మంచి బజ్ క్రియేట్ చేసుకున్న రాధే శ్యామ్ లో ప్రభాస్ సరసన పూజ హెగ్డే నటించిన విషయం తెలిసిందే. యు.వి.క్రియేషన్స్ - టీ సిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకుడు. వింటేజ్ లవ్ స్టోరీగా రూపొందిన రాధే శ్యామ్ విజువల్స్ ఆన్ స్క్రీన్ ఐ ఫీస్ట్ లా ఉంటాయని, ఎస్పెషల్లీ క్లయిమాక్స్ ఎపిసోడ్ ఎక్సట్రార్డినరీగా వచ్చిందనీ ఇన్ సైడ్ టాక్.!
ఇక ఈ నెలాఖరుకి కరోనా కలకలం తగ్గుముఖం పడుతుందనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ రేట్స్ సవరిస్తుందనీ ఆశిస్తున్న రాధే శ్యామ్ మేకర్స్ సినిమా రిలీజ్ కి మార్చ్ 11 ని అనువైన తేదీగా భావిస్తూ ఆ దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరీసారైనా అన్నీ అనుకున్నట్టు కుదురుతాయా.. రాధే శ్యామ్ రాక జరుగుందా అనేది వేచి చూడాలి.