వ్యక్తిగతంగా తనకెంతో ఇష్టమైన హీరో తారక్ అనీ... తారక్ తో తన అనుబంధం బృందావనంకి రైటర్ గా వర్క్ చేసినప్పటినుంచీ ఉందని చెప్పే కొరటాల శివ తారక్ కోసం సూపర్బ్ సెటప్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జనతా గ్యారేజ్ రూపంలో సూపర్ హిట్ కొట్టిన జూ.ఎన్ఠీఆర్ - కొరటాల శివల జంట ఇప్పుడు మరో సినిమా చేస్తోన్న విషయం రెగ్యులర్ ఫిల్మ్ న్యూస్ రీడర్స్ అందరికీ తెలిసిందే. ఎన్ఠీఆర్ 30 గా వస్తోన్న ఈ పాన్ ఇండియా ఫిలింని తారక్ సోదరుడైన నందమూరి కళ్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడైన మిక్కిలినేని సుధాకర్ భారీ స్థాయిలో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక కొరటాల శివ తనదైన శైలిలో ఓ సామాజిక అంశాన్ని స్పృశిస్తూనే ఫుల్ ప్లెడ్జెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తారక్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీని అనుకున్నప్పటికీ అనూహ్యంగా సీన్ లోకి ఎంటర్ అయిన ఆలియాభట్ ఆల్ మోస్ట్ కన్ ఫర్మ్ అయినట్టే అంటున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచంద్రన్ పేరు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. ప్రతి నాయకుడిగానూ ఓ ప్రముఖ నటుడి పేరు ప్రచారంలో ఉంది. ఏదేమైనా మా తారక్ కోసం కొరటాల ఏదో బలంగానే ప్లాన్ చేసి ఉంటారు అంటూ ఆ సినిమా లాంచ్ అయ్యే ఫిబ్రవరి 7 కోసం, ఆ రోజు వెలువడే మరిన్ని వివరాల కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.