ఒకప్పుడు దక్షిణ భారత దేశం అంటే తమిళ్ అని అనుకునేవారు బాలీవుడ్ లో. కానీ ఇప్పుడు మొత్తం సీన్ మారిపోయింది. దక్షిణం లేదా సౌత్ అంటే తెలుగు సినిమా అయ్యింది. ఈమధ్య విడుదల అయిన అల్లు అర్జున్ నటించిన పుష్ప హిందీ లో కూడా అద్భుత విజయం సాధించటం తో బాలీవుడ్ లో అంతా ఇప్పుడు తెలుగు సినిమా వేపు చూస్తోంది. ప్రస్తుతం వున్న బాలీవుడ్ యాక్టర్స్ సినిమాలు కూడా అంత విజయం ఈమధ్య కాలం లో సాధించలేదు, కానీ తెలుగు సినిమాలు అక్కడ తమ హావ కొనసాగిస్తున్నాయి.
ఇప్పుడు అల్లు అర్జున్, అంతకు ముందు ప్రభాస్, అంతకు ముందు రాజమౌళి, ఇలా ఒక్కొక్కరు తమ సత్తా చాటుతున్నారు. మనం తీసేవి తెలుగు సినిమా అయినా, అవి పాన్ ఇండియా గా విడుదల అవుతూ, కాసుల వర్షం కురిపించటమే కాకుండా, బాలీవుడ్ యాక్టర్స్ కి పోటీ గా నిలుస్తున్నాయి ఇప్పుడు. మొన్న నాని సినిమా కూడా పాన్ ఇండియా సినిమా గా విడుదల అయ్యింది. అందుకే, ఇప్పుడు తెలుగు సినిమాలు హిందీ భాషలో విడుదల అవ్వటమే కాకుండా, హిందీ సినిమాలు తెలుగు లో విడుదల చెయ్యడానికి చూస్తున్నారు. అది గొప్ప పరిణామం, దాని బట్టి తెలుస్తోంది, తెలుగు సినిమా ఎంత ప్రభావం అక్కడ చూపిస్తుందో అనేది.
అలాగే చాలామంది హిందీ ఆక్టర్స్ ఇప్పుడు తెలుగు వాళ్ళతో పని చెయ్యాలని కూడా చూస్తున్నారు. ఒక్క కథానాయికలు కాదు, మిగతా యాక్టర్స్ కూడా తెలుగు టెక్నిషియన్స్ తో పని చెయ్యాలని చూస్తున్నారు. ఇందుకు ఉదాహరణ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేసారు.. తాను ముందు ముందు అల్లు అర్జున్ తో పని చెయ్యాలని అనుకుంటున్నాని. ఇప్పుడు సౌత్ అంటే తెలుగు అయ్యింది, ఇప్పుడు తెలుగు సినిమాల కోసం యావత్ భారత దేశం ఎదురుచూస్తోంది.