జగన్ ప్రభుత్వం పోలీసులతో ఎక్కడికక్కడ ఉద్యోగుల నాయకుల్ని గృహ నిర్బంధంలో ఉంచినా కూడా, ఉద్యోగులు ఎక్కడా అధైర్య పడకుండా గురువారం తలపెట్టిన చలో విజయవాడ విజయవంతం చేసారు. పోలీసులు చాలా చోట్ల బారికేడ్లు పెట్టి, ప్రతి వాహనాన్ని తనికీ చేసి కానీ వదల్లేదు. అయినా కూడా వేలాదిమంది ఉద్యోగులు ఎర్ర జెండాలతో విజయవాడ రహదారులు మొత్తం నిండిపోయాయి. విజయవాడ మొత్తం ఎరుపు రంగు పులుపుకున్నట్టు గ మొత్తం విజయవాడ పట్టణం అంతా కనపడింది. ఉవ్వెత్తున లేచిన ఉద్యోగులు ఈ పీఆర్సీ జీవో లను వెనక్కి తీసుకోవాలని, అర్థరాత్రి దొంగతనంగా ఈ జీవో లను ఇచ్చారని, ఇది అన్యాయం అని చెపుతున్నారు.
ఇది కేవలం తమ హక్కుల కోసం పోరాటం అని, ప్రభుత్వం తమను రెచ్చకొట్టే విధంగా చేస్తోందని, అది మంచిది కాదని, ఉద్యోగ సంఘాల వారు చెపుతున్నారు. నేను వున్నా నేను విన్నా అంటూ వుండే జగన్ ఈరోజు ఎక్కడ వున్నారు, ఎక్కడ విన్నారు అని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మా నాయకులతో ముఖ్యమంత్రి చర్చించాలి, అంతే కానీ ఈ సలహాదారులు ఎవరండీ మాట్లాడటానికి, మేము మాట్లాడం వాళ్ళతో అని ఉద్యోగులు తెగేసి చెపుతున్నారు.