చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త తో విడిపోతుంది అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్నా.. ఆ విషయమై మెగా ఫ్యామిలీ మౌనం వహిస్తుంది. అటు చూస్తే శ్రీజ ముంబై లో అన్న రామ్ చరణ్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంటే.. ఇటు కళ్యాణ్ దేవ్ ఒంటరిగా ఎంజాయ్ చేస్తున్నాడు. కళ్యాణ్ దేవ్ ఈ విడాకుల మేటర్ విషయమై స్పందించకపోయినా.. సోషల్ మీడియాలో నెలకో పోస్ట్ పెడుతున్నాడు. ఇక మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మిస్ అయిన కళ్యాణ్ దేవ్ జిమ్ లో తన తదుపరి మూవీ కోసం కండలు పెంచుతున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
తాజాగా తాను ఎంతో సంతోషంగా, ఎన్నో ఆశలతో, ఎంతో ప్రేమతో, ఆనందంగా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. అంటే ఒంటరిగా తాను ఎంజాయ్ చేస్తున్నట్టుగా కళ్యాణ్ దేవ్ పోస్ట్ ఉంది. అటు చూస్తే శ్రీజ ముంబై లో ఉంది.. ఇటు కళ్యాణ్ దేవ్ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాడు. మరి ఈ వ్యవహారం అంతా.. చూస్తుంటే.. వాళ్ళకి విడాకులు తధ్యమని అనిపిస్తుంది. కానీ క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. ఇక ఈ విడాకులు అయితే కళ్యాణ్ దేవ్ ఫ్యూచర్ ఏమిటో అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.