టాప్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ సినిమాలు వదిలెయ్యబోతున్నాడట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేస్తున్నాడు. తాను సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టుగా చెబుతున్నాడు. అది చూసిన చాలామంది నిజమా.. రాహుల్ రామకృష్ణ సినిమాలు వదిలేస్తాడా? ఇది ఫ్రాంక్ కాదు కదా అంటున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాతోనే టాప్ కమెడియన్ గా మారి చాలామంది హీరోలకి ఫ్రెండ్ కేరెక్టర్, చాలా సినిమాల్లో కామెడీ కేరెక్టర్స్ చేస్తూ టాప్ పొజిషన్ లో ఉన్న రాహుల్ ఇలా ఉన్నట్టుండి ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకోనున్నాడో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఆకట్టుకున్న రాహుల్ రామకృష్ణ భరత్ అనే నేను సినిమాల మంచి కేరెక్టర్ చేసాడు.
అలాగే నిన్నగాక మొన్నొచ్చిన సాయి ధరమ్ రిపబ్లిక్ సినిమాలోనూ సీరియస్ నెస్ ఉన్న కేరెక్టర్ చేసాడు. అలాగే త్వరలో విడుదల కాబోయే ఆర్.ఆర్.ఆర్ మూవీలను రాహుల్ రామకృష్ణ నటించాడు. గతంలో మహేష్ భరత్ అనే నేను సినిమాలో తన కేరెక్టర్ హైలెట్ అయ్యి, మహేష్ పాత్ర హైలెట్ అవ్వదనే కారణంగా తన సీన్స్ కొన్ని కట్ చేసారంటూ సంచలనంగా మాట్లాడిన రాహుల్ రామకృష్ణ తర్వాత తన సినిమా రిలీజ్ విషయంలోనూ కాంట్రవర్సీ గా మాట్లాడాడు. ఇక ఇప్పుడు తనకి 2022 చివరి సంవత్సరం సినిమాలకు అంటూ తాను సినిమాల నుండి సెలవు తీసుకోబోతున్నట్టుగా ట్వీట్ చేసి షాకిచ్చాడు.