Advertisementt

వివాదాల సుడిగుండంలో అల్లు అర్జున్

Sat 05th Feb 2022 07:48 PM
allu arjun,ads,rapido controversy,zomato controversy  వివాదాల సుడిగుండంలో అల్లు అర్జున్
Allu Arjun zomato ad lands in controversy వివాదాల సుడిగుండంలో అల్లు అర్జున్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ సినిమాలు ఎంత ఫాస్ట్ గా, వరసగా చేస్తున్నాడో.. అంతే స్పీడు తో కొన్ని బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గాను యాడ్స్ చేసేస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ అలోచించి యాడ్స్ లో పాల్గొంటున్నాడో.. లేదంటే యాజమాన్యం చెప్పినట్టుగా చేసి చేతులు దులుపేసుకుని వచ్చేస్తున్నాడో కానీ.. అల్లు అర్జున్ ని ఈ యాడ్స్ విషయంలో వరస వివాదాలు వెంటాడుతున్నాయి. మొన్నటికి మొన్న బైక్ యాడ్ ర్యాపిడో యాడ్ విషయంలో టీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ నుండి నోటీసు లు అందుకున్నాడు. ఆఖరికి ఆ యాడ్ ని ర్యాపిడో సంస్థ మార్చి చెయ్యాల్సి వచ్చింది.

ఇక తాజాగా అల్లు అర్జున్ మెడకి జొమాటో యాడ్ చుట్టుకుంది. అల్లు అర్జున్ జొమాటోకి బ్రాండ్ అంబాసిడర్ గా ఓ యాడ్ చేసాడు. ఆ యాడ్ లో అర్జున్ నటుడు మరో నటుడు సుబ్బరాజుతో ఫైట్ చేస్తూ ఆయనని కొడతాడు. ఆ యాక్షన్ లో భాగంగా సుబ్బరాజు గాల్లో తేలతాడు. అలా గాల్లో తేలుతున్న సుబ్బరాజు,  అల్లు అర్జున్న తోన్ను తొందరగా కిందకి దించూ, నేను గోంగూర మటన్ తినాలి లేదంటే హోటల్ మూసేస్తారు అని అనగానే.. దానికి అల్లు అర్జున్ సౌత్ సినిమా కదా గాల్లో ఎక్కువసేపు ఎగరాలి అంటూ ఎప్పుడు ఏం కావాలన్నా జొమాటో ఉందిగా అంటూ.. ఎప్పుడు కావాలన్నా, ఏం కావాలన్నా జొమాటో అందిస్తుంది సూపర్ ఫాస్ట్‌గా. మనసు కోరితే తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చెప్తాడు. ఆ యాడ్ లో యాక్షన్ బావుంది, డైలాగ్స్ బావున్నాయి, అల్లు అర్జు స్టయిల్ బావుంది.

కానీ బాగోనిదల్లా సౌత్ సినిమాని కించపరచడమే అంటున్నారు కొంతమంది నెటిజెన్స్. నార్త్ కి తీసిపోని విధంగా సినిమాలు వదులుతున్నా, సౌత్ ఇండస్ట్రీ మీద ఓ సౌత్ హీరోనే ఇలాంటి డైలాగ్స్ మాట్లాడితే.. నార్త్ హీరోల ముందు పరువేం ఉంటుంది అంటూ నెటిజెన్స్ జొమాటో యాడ్ పై, అల్లు అర్జున్ పై ట్రోల్ చేస్తున్నారు. 

Allu Arjun zomato ad lands in controversy:

Yesterday Rapido Controversy Today Zomato Controversy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ