రామ్ చరణ్ - రానా మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. మిడ్ నైట్ ఫోన్ చేసే చనువు తనకి రామ్ చరణ్ తో ఉంది అని.. తనకి ఎప్పుడు అవసరం వచ్చినా రామ్ చరణ్ తో మాట్లాడతాను అని ఒకసారి ఓ టాక్ షో లో రానా చెప్పాడు. అంత మంచి ఫ్రెండ్స్ వాళ్లిద్దరూ. ఎవరికి వారే వారి కెరీర్ లో బిజీగా వున్న స్టార్స్. అయితే వాళ్లిద్దరూ హైదరాబాద్ లో తరుచూ పార్టీస్ లోనో, లేదంటే పర్సనల్ గానో కలవడమనేది పెద్ద విషయం కాదు. కానీ ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ ముంబై లో మీట్ అవడమే విశేషం. రామ్ చరణ్ రీసెంట్ గా చెల్లి శ్రీజ తో కలిసి ముంబై వెళ్ళాడు.
గత వారం రోజులుగా చరణ్ అక్కడే ముంబై లోనే ఉన్నాడు. ఇక రీసెంట్ గా రానా కూడా భార్య మెహిక, బాబాయ్ వెంకటేష్ తో కలిసి ముంబై లో కాలు పెట్టాడు. ఎందుకంటే రానా - వెంకటేష్ కలయికలో నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తున్న రానా - నాయుడు వెబ్ సీరీస్ షూటింగ్ కోసం. అలా రామ్ చరణ్ ముంబై లో రానా నాయుడు ని కలిసినప్పుడు అక్కడి ఫోటో గ్రాఫర్ క్లిక్ మనిపించిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి స్నేహితులిద్దరూ ముంబై లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది ఆ పిక్ చూస్తుంటే.