Advertisementt

అల్లు ఆర్మీ మరో కొత్త కథ అల్లేశారు.!

Sun 06th Feb 2022 12:37 PM
allu arjun upcoming films,pushpa the rise,pushpa the rule,pushpa hero allu arjun next project with atlee,allu arjun movie with rajkumar hirani  అల్లు ఆర్మీ మరో కొత్త కథ అల్లేశారు.!
Gossips On Allu Arjun Next అల్లు ఆర్మీ మరో కొత్త కథ అల్లేశారు.!
Advertisement
Ads by CJ

టికెట్ రేట్స్ ఇష్యూ వల్ల ఆంధ్రాలో నష్టాలు చవిచూసినప్పటికీ నార్త్ జనాలు ఎర్త్ షాటరింగ్ రిసెప్షన్ ఇవ్వడం వల్ల హిందీలో వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టి పుష్పతో పాన్ ఇండియా స్టార్ డమ్ పొందాడు అల్లు అర్జున్. ప్లాన్డ్ ప్రమోషన్స్ అంటున్నా, పెయిడ్ పబ్లిసిటీ అనే విమర్శలు వినిపిస్తున్నా పుష్ప క్యారెక్టర్ లో బన్నీ బాబు దున్నేసాడనేది మాత్రం వాస్తవం. అయితే అల్లు ఆర్మీ అని చెప్పుకునే ఆయన అభిమానులు ఇంతటి మంచి మూమెంట్ ని ఎంజాయ్ చెయ్యడం పక్కనపెట్టి తమ హీరో చెయ్యబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటూ చిత్ర విచిత్రమైన కాంబినేషన్స్ ని ప్రచారంలోకి తెస్తున్నారు. ఆ డైరెక్టర్ తో ఓకే అయిపొయింది, ఈ డైరెక్టర్ తో చర్చల్లో ఉంది అంటూ గాసిప్స్ మోసుకొచ్చి సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు.

మొన్నటికి మొన్న అట్లీతో లైకా బేనర్ మూవీకి బన్నీ ఓకే అనేశాడన్నారు. నిన్నటికి నిన్న మహేష్ సినిమా తర్వాత రాజమౌళి చేసేది అల్లు అర్జున్ సినిమానే అంటూ సందడి చేసారు. నేడైతే బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉందంటూ కొత్త పుకారు పుట్టించి, మసాలాలు దట్టించి హడావిడి మొదలుపెట్టారు. మరి ఇన్ని ఫేక్ న్యూస్ లు మీడియాలో హల్ చల్ చేస్తుంటే వాటిని వారించకుండా, ఖండించకుండా బన్నీ పీఆర్ టీమ్ ఎందుకు సైలెంట్ గా వుంటున్నట్టో..!!

Gossips On Allu Arjun Next:

Bunny Fans Creating Rumours 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ