Advertisementt

లతా మంగేష్కర్ మృతి పట్ల బాలయ్య సంతాపం

Sun 06th Feb 2022 01:15 PM
hindupur mla,balakrishna,lata mangeshkar death  లతా మంగేష్కర్ మృతి పట్ల బాలయ్య సంతాపం
Balakrishna mourn Lata Mangeshkar death లతా మంగేష్కర్ మృతి పట్ల బాలయ్య సంతాపం
Advertisement
Ads by CJ

దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతి కల్గించింది. భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ లతా మంగేష్కర్. 7దశాబ్దాల్లో 30కి పైగా భాషల్లో 30వేల పాటలు పాడటం లతామంగేష్కర్ గానమాధుర్యానికి నిదర్శనం..

దేశంలో ఆమె పాట వినబడని ఇల్లు లేదు, ఆమె గానం మెచ్చని వ్యక్తి లేడు.. ఆమె పొందని అవార్డు లేదు, రాని రివార్డు లేదు..

భారత రత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే...అవార్డులే కాదు విదేశీ ప్రభుత్వాలు కూడా పలు పురస్కారాలందించి ఆమెను గౌరవించాయి.  

లతా మంగేష్కర్ మృతి మనదేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

నందమూరి బాలకృష్ణ

( హిందూపూర్ శాసనసభ్యుడు)

Balakrishna mourn Lata Mangeshkar death:

Hindupur MLA Balakrishna mourn Lata Mangeshkar death

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ