డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా రమేష్ వర్మ డైరెక్షన్ లో రవితేజ చేసిన ఖిలాడీ మూవీ ఈ ఫిబ్రవరి 11 న రిలీజ్ కాబోతోంది. ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో.. ఆల్ క్లాసెస్ ఆడియన్స్ కీ నచ్చే యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది ఖిలాడీ. అలాగే మాస్ కి నచ్చే మసాలాలన్నీ కూడా వెండితెరపై విందు చేసేలా రంగరించారట. అందులో భాగమే కథానాయికలు ఇద్దరూ కావాల్సినంత గ్లామర్ షో చెయ్యడం... హీరో గారితో ముద్దు సీన్స్ వెయ్యడం.! అందులోనూ స్వతహాగా రసికుడైన దర్శకుడు రమేష్ వర్మ ఆయా సన్నివేశాలను కాస్త ఘాటుగానే తెరపైకి తెచ్చారట. సెన్సార్ కత్తెర వేసే షాట్స్ చాలానే ఉన్నాయని అంటోన్న ఈ ఖిలాడి ఎన్ని కట్స్ తో బయటపడుతుందో.. ఎన్ని షాట్స్ బ్లర్ చేయించుకుంటుందో చూడాలి. సెన్సార్ సభ్యులు కరుణించి చూసీ చూడనట్లు వదిలేస్తే మాత్రం మాస్ ఆడియన్స్ కి మాంచి కిక్ ఇచ్చేస్తాడంట ఖిలాడి.