Advertisementt

14 తర్వాతే ఏ క్లారిటీ అయినా..

Sun 06th Feb 2022 07:13 PM
bheemla nayak,ap cm jagan,bheemla nayak makers,dj tillu,khiladi movie,sehari movie  14 తర్వాతే ఏ క్లారిటీ అయినా..
Any clarity after February 14 14 తర్వాతే ఏ క్లారిటీ అయినా..
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఆంధ్రాలో టికెట్ రేట్స్ ఇష్యు ఓ కొలిక్కి రాలేదు, అలాగే కోవిడ్ వలన అక్కడి ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలు చెయ్యడంతో.. సెకండ్ షోస్ పడడం లేదు. దానితో చాలా సినిమాలు విడుదల విషయంలో ఇంకా ఆలోచనలోనే ఉన్నారు మేకర్స్. అయినప్పటికీ. జగన్ హామీ ఇచ్చారంటూ ఖిలాడీ ప్రొడ్యూసర్ ఖిలాడీ మూవీ ని ఫిబ్రవరి 11 కే రిలీజ్ చేస్తున్నామని చెబుతున్నారు. అలాగే కొత్త హీరో సెహరి, సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు కూడా అదే వారం రిలీజ్ అవుతున్నాయి. మరి ఫిబ్రవరి 25 న రిలీజ్ అవ్వాల్సిన భీమ్లా నాయక్ విషయమే ఇంకా ఎటు తేల్చడం లేదు నిర్మాతలు. జగన్ ని అడగండి.. భీమ్లా నాయక్ రిలీజ్ ఎప్పుడు అని నిర్మాత నాగ వంశీ.. అన్నా, ఆ సినిమా ఫిబ్రవరి 25  లేదా ఏప్రిల్ 1 అనే కన్ఫ్యూషన్ లో పవన్ ఫాన్స్ ఉన్నారు.

ఏపీ సీఎం జగన్ వచ్చి చెప్పేదేముంది.. 14 నుండి నైట్ కర్ఫ్యూ ఎత్తేస్తే.. భీమ్లా నాయక్ విడుదల ఈ నెల 25 ఉంటుంది. లేదంటే ఏప్రిల్ 1 వరకు వేచి చూడాల్సిందే. అందుకే నిర్మాతలు కూడా భీమ్లా నాయక్ పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటున్నా.. ప్రమోషన్స్ కార్యక్రమాలు ఇంకా మొదలు పెట్టలేదు. ఏదైనా ఫిబ్రవరి 14 తర్వాతే అన్నట్టుగా ఉంది వారి ప్రవర్తన.. మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగిస్తే.. భీమ్లా నాయక్ ని ఆరామ్స్ గా ఏప్రిల్ 1 కి విడుదల చేద్దాం.. అప్పుడు ప్రమోషన్స్ మొదలు పెడదామని మేకర్స్ ఆలోచన. మరి జగన్ గారు ఏం చేస్తారో చూడాలి. 

Any clarity after February 14:

Bheemla Nayak either on 25 Feb or 1st April

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ