Advertisementt

మారిన చెర్రీ మైండ్ సెట్ - షెడ్యూల్ అప్ సెట్.?

Sun 06th Feb 2022 09:18 PM
ram charan in rrr movie,ram charan as siddha in acharya film,rrr release date march 25th,acharya release date april 29th,f3 release date april 28th,ram charan not happy with dil raju  మారిన చెర్రీ మైండ్ సెట్ - షెడ్యూల్ అప్ సెట్.?
Ram Charan Upsets With Dil Raju Behaviour ..? మారిన చెర్రీ మైండ్ సెట్ - షెడ్యూల్ అప్ సెట్.?
Advertisement
Ads by CJ

ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ మార్చ్ 25 అని రాజమౌళి ప్రకటించడంతో ఏప్రిల్ 1 అనుకున్న ఆచార్యను ఏప్రిల్ 29 కి వాయిదా వేయించారు చిరంజీవి. అయితే పెద్ద సినిమాల విడుదల తేదీలపై సానుకూలంగా చర్చించుకుని కనీసం రెండు వారాల గ్యాప్ ఉండేలా చూసుకుంటాం అని మీడియా ముఖంగా చెప్పిన దిల్ రాజు ఆ మాటను పాటించకుండా ఏప్రిల్ 28 న తమ F 3 వస్తుందని ఎనౌన్స్ చేసారు. అదిగో అదే చరణ్ కి చిరాకు తెప్పించిందట. నిర్మాతగా, పంపిణీదారుడిగా ఎంతో ఎక్సపీరియన్స్ ఉన్న దిల్ రాజు ఇలా వింతగా ప్రవర్తించడం ఏమిటని విసుక్కున్నాడట. ఇంతకీ దిల్ రాజు పంతానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే ట్రేడ్ సర్కిల్ లో చెప్పుకుంటోన్న ఓ వెరైటీ రీజన్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే....

2021 సంక్రాంతికి క్రాక్ సినిమాని నైజాంలో పంపిణీ చేసిన వరంగల్ శ్రీను అనే డిస్ట్రిబ్యూటర్ తనకు సరైన థియేటర్స్ దక్కనివ్వలేదంటూ దిల్ రాజుపై బహిరంగంగానే విమర్శలు చేసాడు. వివాదం రేపాడు. ఇప్పుడు అదే వరంగల్ శ్రీను చాలా పట్టుదలగా ప్రయత్నించి, దిల్ రాజుకంటే ఎక్కువ ఎమౌంట్ కోట్ చేసి ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నాడు. దాంతో పంతం పట్టిన దిల్ రాజు రిలీజ్ డేట్ విషయంలో తగ్గేదేలే అంటూ హడావిడి చేస్తున్నారు కానీ చిరంజీవి ఒక్క మాట చెప్పారంటే టక్కున ఓకే అనక తప్పదులెండి దిల్ రాజుకి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే...

మూడ్ ఆఫ్ లో ఉన్న రామ్ చరణ్ షూటింగ్ కి డుమ్మా కొట్టాడంటే ఎఫెక్ట్ అయ్యేదీ దిల్ రాజే. ఎందుకంటే తను నిర్మిస్తోన్న చరణ్ - శంకర్ ల సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇప్పుడు రాజమండ్రి సమీపంలోని బొబ్బిల్లంకలో స్టార్ట్ కావాల్సి ఉంది. అదే విలేజ్ లో దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ ఉంటుందని తెలిసింది. మరీ వర్రీడ్ మైండ్ సెట్ లో ఉన్న చెర్రీ  షూటింగ్ కి అటెండ్ అవుతాడా లేక ముందు ఆర్ ఆర్ ఆర్ - తర్వాత ఆచార్య ప్రమోషనల్ పనులు చూసుకుంటా అంటాడా..?? 

Ram Charan Upsets With Dil Raju Behaviour ..?:

Acharya - F3 Release Dates Controversy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ