ఈమధ్యన ఏ హీరోయిన్ అవని విధంగా హైలెట్, ట్రేండింగ్ బాలీవుడ్ క్యూటీ అలియా భట్ అవుతుంది. కారణం ఆమె నటించిన సినిమాలు. అలియా భట్ నటించిన రెండు క్రేజీ మూవీస్ నెల గ్యాప్ లో విడుదల కాబోతున్నాయి. టాలెంటెడ్ బ్యూటీ అయిన అలియా భట్ మెయిన్ లీడ్ లో బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూభాయ్ కతీయవాడి ఈ నెల 25 న విడుదల కాబోతుంది. గంగూభాయ్ గా అలియా భట్ లుక్స్ కి బాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. సౌత్ ఫాన్స్ కూడా ఫిదా అయ్యారు. రీసెంట్ గా విడుదలైన గంగూభాయ్ కతీయవాడి ట్రైలర్ లో అలియా భట్ పెరఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరు అప్రిషెట్ చేసారు.
ఇక తాజాగా ఆ సినిమా నుండి ఓ పిక్ రిలీజ్ చేసారు. ఆ పిక్ లో అలియా భట్ తనలాంటి మహిళలని దగ్గరకి తీసుకునే సీన్ లోని పిక్ అది. నిజంగా అలియా భట్ ని ఆ పిక్ లో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. అంత క్యూట్ గా, మెస్మరైజింగ్ గా, పరిణితి చెందిన నటిగా ఆమె ఫేస్ లోని ఎక్సప్రెషన్స్ చూస్తే అనిపించకమానదు. లూజ్ హెయిర్ తో, పెద్ద బొట్టుతో, ముక్కుకు ముక్కెర తో అలియా భట్ అనుభవాలు కాచి వడపోసిన అమ్మాయిగా కనబడుతుంది. నిజంగా ఆ పిక్ చూస్తుంటే అలియా లోని అందం ద్విగుణీకృతమవుతుంది.
మరి గంగూభాయ్ గా అందరితో శెభాష్ అనిపించించుకున్న అలియా భట్.. ఆర్.ఆర్.ఆర్ సీత గా కనిపిస్తే ఇక అంతే. ఆర్.ఆర్.ఆర్ మార్చి 25 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఆర్.ఆర్.ఆర్ లోని అలియా భట్ సీత లుక్స్ ఇప్పటికే అందరిని ఆకట్టుకున్నాయి. మరి ఆమె పెర్ఫార్మెన్స్ చూడాలంటే కొద్దిగా వెయిట్ చెయ్యాల్సిందే.