Advertisementt

సర్కారు వారి.. పాట కోసం పాట్లు

Mon 07th Feb 2022 12:10 PM
sarkaru vaari paata,mahesh babu,parasuram,keerthy suresh,sarkaru vaari paata update  సర్కారు వారి.. పాట కోసం పాట్లు
Sarkaru Vaari Paata update సర్కారు వారి.. పాట కోసం పాట్లు
Advertisement
Ads by CJ

ఈమధ్యన రెండు రిలీజ్ డేట్స్ ఇచ్చి అందులో ఒకటి ఫైనల్ చెయ్యడమనేది ఓ ట్రెండ్ గా మారింది. ఆర్.ఆర్.ఆర్, రామారావు ఆన్ డ్యూటీ, భీమ్లా నాయక్, అంటే సుందరానికి వంటి చిత్రాలు ఇలానే రెండు మూడు డేట్స్ లాక్ చేసి ఫైనల్ గా ఒక డేట్ ఫిక్స్ చేస్తోన్న విషయం తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు మహేష్ బాబు సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ అప్ డేట్ కి నాలుగు తేదీలు ఇచ్చారు. అంటే సర్కారు వారి మొదటి పాట ఫిబ్రవరి 14 న వాలైంటైన్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ సింగిల్ కోసం ఇచ్చే అప్ డేట్స్ కి తేదీలని ఫిక్స్ చేసారు. ఫిబ్రవరి 7, 9, 11, ఫైనల్ గా 14 తేదీలలో అంటూ చెప్పేసారు. అంటే ఒకటి పోస్టర్ తో అప్ డేట్, మరొకటి ప్రోమో అప్ డేట్, ఇంకొకటి.. కౌంట్ డౌన్ అప్ డేట్ ఇస్తారేమో ఇలా డేట్స్ ఇచ్చారు అంటున్నారు మహేష్ ఫాన్స్. 

ప్రస్తుతం ఉన్న ట్రెండులో ఓ సాంగుని పాపులర్ చేయడం, దాని రీచ్ పెంచడం చాలా టఫ్ జాబ్ అయిపోయింది. అందుకే మహేష్ లాంటి సూపర్ స్టార్ చేసిన సర్కారు వారి... పాటకీ ఈ పాట్లు తప్పడం లేదు. మొత్తానికైతే ఇలా నాలుగు తేదిలిచ్చి సర్కారు వారి పాట సింగిల్ పై అంచనాలు, ఆసక్తి కలిగిస్తున్నారు. 

కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. రీసెంట్ గా మొదలైన కొత్త షెడ్యూల్ లో ఇంకా మహేష్ పాల్గొనడం లేదు. ఫిబ్రవరి రెండో వారం నుండి సర్కారు వారి పాట షూటింగ్ లో మహేష్ జాయిన్ అవుతారట. ఇక మహేష్ బాబు SSMB28 మూవీ పూజా కార్యక్రమాలు రీసెంట్ గా జరిగాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు - పూజ హెగ్డే కాంబోలో ఈ మూవీ ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్లనుంది. 

Sarkaru Vaari Paata update:

Sarkaru Vaari Paata first single update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ