దర్శకుడు నాగ్ అశ్విన్ మాటలతో పాన్ వరల్డ్ ఫిలింగా పాపులర్ అయిన ప్రభాస్ ప్రాజెక్ట్ K చిత్రం షూట్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్ సిద్ధమైంది. హీరో ప్రభాస్ - హీరోయిన్ దీపికా పదుకునేలపై చిత్రీకరించాల్సిన కొన్ని కీలక సన్నివేశాలకై పది రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసారు. అయితే అంతా సిద్ధం అయినప్పటికీ ఈ షూట్ లో ప్రభాస్ పాల్గొనడం డౌటే అని సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం కాస్త బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతున్నారట ప్రభాస్. ఆ కారణం చేతనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మీటింగ్ కి ప్రభాస్ వెళ్లడంపై సందేహాలు నెలకొన్నాయి.
నిజానికి ఈ పది రోజులూ ప్రాజెక్ట్ K షూట్ కి అటెండ్ అయి ఆపై మర్చి 11 న విడుదల కాబోయే రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో పాల్గొనాలని ప్లాన్ చేసుకున్నారు ప్రభాస్. మరి అనుకున్న ప్రణాళిక ప్రకారం అన్నీ జరగాలంటే వీలైనంత త్వరగా తన బ్యాక్ పెయిన్ బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోవాలి. లెట్స్ ప్రే ఫర్ దట్..!