బిగ్ బాస్ సీజన్ 5 కి రాకముందే యూట్యూబ్ లో సోషల్ మీడియాలో తానేమిటో ప్రూవ్ చేసుకున్న షణ్ముఖ్ జాస్వంత్.. బిగ్ బాస్ లోకి వచ్చాక మరింతగా పాపులర్ అయ్యాడు. అయితే అది అతనికి క్రేజ్ పెంచే పాపులారిటీ కాదు. అంటే బిగ్ బాస్ లో తన ఫ్రెండ్ సిరి తో చేసిన అతి ఫ్రెండ్ షిప్ వలన షణ్ముఖ్ బాగా బ్యాడ్ అయ్యాడు. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక షణ్ముఖ్ నేరుగా వైజాగ్ వెళ్ళిపోయాడు. వైజాగ్ లో షణ్ముఖ్ కి అదిరిపోయే ఇల్లు ఉంది. ఆ విషయం ఈ మధ్యనే షణ్ముఖ్ మధర్ హోమ్ టూర్ అంటూ యూట్యూబ్ లో చూపించారు. దాని తర్వాత షణ్ముఖ్ ఎంత ధనవంతుడో అనేది తెలిసింది. వర్క్ దృష్యా షణ్ముఖ్ ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. అయితే ఈమధ్యన షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన బ్రేకప్ చెప్పాక షణ్ముఖ్ కాస్త ఒంటరిగానే ఫీల్ అవుతున్నాడు.
ఈమధ్యనే కొత్తగా వెబ్ సీరీస్ మొదలు పెట్టినట్లుగా చెప్పి సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యాడు. అయితే రీసెంట్ గా షణ్ముఖ్ హైదరాబాద్ లో కొత్తిల్లు కొన్నాడు. హైదరాబాద్ లోని పార్శ్ ఏరియా లో ఒక ఇల్లు కొనుగోలు చెయ్యడమే కాదు, కొత్తింటి గృహ ప్రవేశం కూడా పూర్తి చేసాడు. తన కో యాక్ట్రెస్ తో కలిసి షణ్ముఖ్ కొత్తిల్లు గృహ ప్రవేశం చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఇకపై షణ్ముఖ్ హైదరాబాద్ లోనే ఉండి అన్ని వర్క్స్ ప్లాన్ చేసుకుంటుంటాడేమో చూడాలి.