Advertisementt

కళ కళలాడుతున్న పోస్టర్ తో మహేష్

Wed 09th Feb 2022 05:45 PM
superstar mahesh babu,sarkaru vaari paata,kalaavati song poster,keerty suresh  కళ కళలాడుతున్న పోస్టర్ తో మహేష్
Sarkaru Vaari Paata Brand New Poster కళ కళలాడుతున్న పోస్టర్ తో మహేష్
Advertisement
Ads by CJ

సరిలేరు నీకెవ్వరూ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట. ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సర్కారు వారి పాట ని మే 12న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ప్రమోషన్స్ లో భాగంగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోన్నారు. ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా ఫస్ట్ టైం మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది.

ఇందులో కీర్తి సురేష్ పాత్ర పేరు కళావతి. ఆ పాత్ర పేరు మీదుగా ఫస్ట్ సింగిల్ ఉండబోతుంది అని హింట్ ఇస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఆ పోస్టర్ లో మహేష్ బాబు, కీర్తి సురేష్ మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీ కనిపిస్తుంది. అలాగే మహేష్ హ్యాండ్ సమ్ గా స్టలిష్ గా కనిపిస్తుంటే.. కీర్తి సురేష్ మెరిసే చీరలో క్యూట్ గా, అందంగా ఉంది. ఇదివరకెన్నడూ చూడని స్టైలిష్ లుక్ లో మహేష్ బాబుని ప్రెజెంట్ చేస్తున్నాడు దర్శకుడు పరశురామ్. ప్రస్తుతం కళావతి సమేతంగా కళ కళలాడుతూ వచ్చిన ఈ పోస్టర్ మహేష్ ఫాన్స్ కి, ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేసింది. 

Sarkaru Vaari Paata Brand New Poster :

Superstar Mahesh Babu Sarkaru Vaari Paata Brand New Poster From 1st Single Kalaavati Unleashed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ