శర్వానంద్ లేటెస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా ని ఈ నెల 25 న రిలీజ్ చెయ్యబోతున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించినప్పటినుండే.. ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీం. ఈ సినిమాలో శర్వానంద్ కి జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించడం, ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. అలాగే ఖుష్బూ, రాధికా లాంటి సీనియర్ యాక్ట్రెస్ ఈ సినిమాలో భాగమవడం తో అందరిలో ఆసక్తి పెరిగింది. ఇక తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు నుండి టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ లోకి వెళితే..
ప్రతి మగవాడి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. కానీ ఇంట్లో 10 మంది ఆడవాళ్లు ఉండి పెళ్ళికి ఓకె చెయ్యడం ఇంచుమించు నరకం అంటూ శర్వా వాయిస్ ఓవర్ తో గ్రాండ్ మొదలైంది టీజర్. ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదంటరా అని రాధికా చెప్పగానే.. మనం రిజక్ట్ చేసే స్టేజ్ నుండి వాళ్ళు రిజెక్ట్ చేసే స్టేజ్ కి తీసుకొచ్చేశారన్నమాట అంటూ నవ్వేస్తాడు శర్వానంద్. తర్వాత స్వీట్ గా రశ్మిక్ ఎంట్రీ. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారో అంటూ.. మీలాంటి జెన్యూన్ గా ఉండే పర్సన్ కి దగ్గరవడం నా అదృష్టం అన్న రశ్మికనే.. చివరికి శర్వానంద్ ని రిజెక్ట్ చేసే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. శర్వానంద్ కూల్ లుక్స్ తో, డీసెంట్ గా కనిపించాడు.
రష్మిక సారీస్ లోను, చుడీదార్స్ లో డీసెంట్ గా అందంగా కనిపించింది. ఇతర కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా దర్శకుడు కిషోర్ తిరుమల ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ని తెరకెక్కించినట్లుగా టీజర్ చూస్తే తెలుస్తుంది.