ఈమధ్యన ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా.. సీరియల్ నటుల హోమ్ టూర్స్, సింగర్ హోమ్ టూర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళని అందంగా డెకరేట్ చేసి మరీ షూట్ చేస్తూ యూట్యూబ్ ఛానల్స్ లో పెట్టినట్లుగా .. ఎమ్యెల్యే రోజా, జబర్దస్త్ జేడ్జ్ గా తన హోమ్ టూర్ ని గురువారం ప్రసారం అయిన జబర్దస్త్ లో చూపించి సర్ ప్రైజ్ చేసారు. రోజాకి హైదరాబాద్, చెన్నై, ఆమె సొంతూరు నగరి లో సొంత ఇళ్ళు ఉన్నాయి. హైపర్ ఆది తన టీమ్ తో నగరి రోజా గారి ఇంటికి వెళ్లి హోమ్ టూర్ చేసి తన స్కిట్ లో ప్లే చేసారు. రోజా ఇల్లు నిజంగా భూతాల స్వర్గాన్ని తలపించింది.
రోజా కూడా చాలా స్పోర్టివ్ గా తన ఇంటిలోని ప్రతి రూమ్ ని చూపిస్తూ జబర్దస్త్ టీమ్ కి సహకరించారు. ఆది అయితే రోజా మీద వేసిన పంచెస్ బాగా హైలెట్ అయ్యాయి. ఆది రోజా మీద అడుగడుగునా వేసిన పంచెస్ బాగా లేపాయి. ఇక రోజా దేవుడి రూమ్ దగ్గర నుండి, డైనింగ్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, బెడ్ రూమ్స్, పిల్లల బెడ్ రూమ్, ఇంకా టాప్ ఫ్లోర్, వాళ్ళ లాన్ అన్ని చూపించారు. రోజా హోమ్ టూర్ ఎంతగా హైలెట్ అయ్యిందో అంతగా ఆది పంచ్ లు పేలాయి. ఆది నా మీద ఎవరు పంచ్ వేసినా వారు చస్తారు.. కానీ నిన్ను ఏమి అనలేకపోతున్నాను అంటూ రోజా కూడా ఈ స్కిట్ హోమ్ టూర్ ని సరదాగా తీసుకోవడం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.