నిన్న గురువారం ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖులైన చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల, పోసాని, నారాయణమూర్తి లు సమావేశమయ్యారు. ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. కొన్ని విషయాల్లో జగన్ సానుకూలంగా ఉండగా.. మరికొన్ని విషయాల్లో టాలీవుడ్ జగన్ కి సహకరించేలా ఒప్పందాలు జరిగాయి. అయితే ఈ సమావేశానికి రాని కొంతమంది.. మెగాస్టార్ పై సెటైర్స్ కూడా వేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం అందరిని పిలవాలి, కొంతమంది కె ఇంపార్టెన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని నారాయణ మూర్తి మీడియా ముందే చెప్పారు. ఇక్కడ మెగాస్టార్ తప్పు చేసారో.. ఒప్పే చేసారో.. ఈ సమావేశం వలన ఇండస్ట్రీకి ఎంతో కొంత మేలు అయితే జరిగింది అనేది వాస్తవం.
అయితే మెగాస్టార్ చిరు గతంలో జగన్ ని కలవడం, ఆ తర్వాత మరికొంతమంది వెళ్లి పేర్ని నానిని మీటవడం తో.. టికెట్ రేట్స్ ఇష్యుపై ఇండస్ట్రీ అంతటా ఒకతాటి మీదకి రావాలి కానీ.. ఎవరో ఒకరు జగన్ ని కలిస్తే అది పర్సనల్ మీటింగ్ అవుతుంది అంటూ ప్రస్తుత మా అధ్యక్షుడు మంచు విష్ణు కామెంట్స్ చేసారు. ఇక నిన్నటి సమావేశంలో మంచు ఫ్యామిలీకి ఆహ్వానం అందినా వెళ్లలేదో? అసలు ఆహ్వానం రాలేదో? కానీ ఆ మీటింగ్ లో వారు మిస్ అయ్యారు. అయితే ఈ రోజు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి గారు నాని నే మంచు ఫ్యామిలీ తమ ఇంటికి రప్పించుకుంది. హైదరాబాద్ లో బొత్స కొడుకు పెళ్ళికి హాజరైన మంత్రి పేర్ని నాని.. మంచు ఫ్యామిలీ ఆహ్వానం మన్నించి వారి ఇంటికి వెళ్లారు.
దానితో మంచు విష్ణు మీకు మా ఇంట్లో ఆదిత్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది నాని గారు అంటూ ట్వీట్ చెయ్యడమే కాదు.. సినిమా టికెట్ల అంశంపై మీరు తీసుకున్న చొరవకు, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రణాళికలను మాకు వివరించినందుకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ ప్రయోజనాలను కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు అని అన్నారు. ఇండస్ట్రీ పెద్దలతో కలవకుండా.. ఇలా ఒంటరిగా మంచు ఫ్యామిలీ మంత్రిగారినే ఇంటికి పిలిపించుకుని మరీ ఇండస్ట్రీ సమస్యలపై చర్చించి ధన్యవాదాలు చెప్పారుగా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.