మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. వైష్ణవ్ తన తదుపరి మూవీ రంగ రంగ వైభవంగా చేస్తున్నాడు. ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం దర్శకత్వం వహిస్తుండగా.. కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. టైటిల్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది ఈ సినిమా మీద. ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని, ఫస్ట్ లుక్ టీజర్‌కి, టైటిల్‌కి వచ్చిన పాజిటివ్ వైబ్స్ రావడంతో టీం హ్యాపీ గా ఉంది.
ఈ ఏడాది వేసవి కానుకగా మే 27న రంగ రంగ వైభవంగా సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. సేద దీరుతున్న కేతిక శర్మ వైపు తదేకంగా చూస్తున్న వైష్ణవ్ తేజ్ లుక్ యూత్‌ని అట్రాక్ట్ చేస్తోంది.